Breaking News

సైబర్‌ నేరగాళ్ల ‘పెళ్లి పిలుపులు’!

Published on Fri, 11/22/2024 - 04:55

సాక్షి, హైదరాబాద్‌: సీజన్‌కు అనుగుణంగా సైబర్‌ కేటుగాళ్లు కొత్త పంథాలో మోసాలకు తెరదీస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఇదే అంశాన్ని వారికి అనుగుణంగా మల్చుకుని కొత్త దందా మొదలుపెట్టారు. వాట్సాప్‌ మెసేజ్‌లలో పెళ్లి పత్రికల పేరుతో ఏపీకే (ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజీ) ఫైల్స్‌ను క్రియేట్‌ చేసి పంపుతున్నట్టు పోలీసులు హెచ్చరించారు. తెలియని ఫోన్‌ నంబర్ల నుంచి ఆహ్వాన పత్రికల పేరిట ఇలాంటి మెసేజ్‌లు వస్తే వాటిలోని లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని వారు సూచిస్తున్నారు. 

ఇలాంటి ఫైల్‌ ఓపెన్‌ చేయగానే సైబర్‌ నేరగాళ్లకు చెందిన సాఫ్ట్‌వేర్‌ మన ఫోన్లో ఇన్‌స్టాల్‌ అవడంతోపాటు మన వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, కాంటాక్ట్‌ నంబర్ల జాబితా సైబర్‌ నేరగాళ్లకు చేరుతుంది. దీంతో ఫోన్‌ను హ్యాక్‌ చేసి వారి చేతుల్లోకి తీసుకుంటారని, తర్వాత మన బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొట్టడం..డబ్బుల కోసం డిమాండ్‌ చేయడం వంటి ప్రమాదాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. 

వాట్సాప్‌తోపాటు ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ల ఖాతాల నుంచి వచ్చే ఆహ్వాన పత్రికలు, వీడియోలు, డాక్యుమెంట్లు, లింకులు, ఏపీకే ఫైల్స్‌ వేటిపైనా క్లిక్‌ చేయవద్దని సూచించారు. ఒక వేళ పొరపాటున క్లిక్‌ చేస్తే వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కు లేదా  www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)