Breaking News

‘కోల్‌కతా’ నిందితునికి ముగిసిన లై డిటెక్టర్‌ పరీక్ష

Published on Mon, 08/26/2024 - 04:33

న్యూఢిల్లీ: కోల్‌కతాలో ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాలలో జూనియర్‌ వైద్యురాలి దారుణ హత్యోదంతంలో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌కు ఆదివారం లై డిటెక్షన్‌ పరీక్ష నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. కోల్‌కతాలో ప్రెసిడెన్సీ కారాగారంలోనే పరీక్ష పూర్తిచేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఢిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లే»ొరేటరీ నుంచి పాలిగ్రఫీ నిపుణులు కోల్‌కతాకు వచ్చారు.

మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌తో పాటు హతురాలితో పాటు పనిచేసే నలుగురు వైద్యులకు శనివారమే లై డిటెక్షన్‌ టెస్ట్‌ చేశారు. ఆ పరీక్షలో వాళ్లు ఏమేం చెప్పారనే వివరాలను పోలీసులు బయట పెట్టలేదు. సత్యశోధన పరీక్షలో వీళ్లు చెప్పిన అంశాలను సాక్ష్యాధారాలుగా కోర్టులో ప్రవేశపెట్టేందుకు చట్టపరంగా అనుమతి లేనప్పటికీ కేసు దర్యాప్తులో ఆ వివరాలు ఎంతో ఉపయోగపడతాయి.

ఘోష్‌ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు 
కర్‌ వైద్య కళాశాలకు ప్రిన్సిపల్‌గా ఉండగా సందీప్‌ ఘోష్‌ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ ఆదివారం ఆకస్మిక సోదాలు చేపట్టింది. ఉదయమే కేంద్ర బలగాలతో ఘోష్‌ ఇంటికి వెళ్లిన అధికారులు డోర్లు తెరవకపోవడంతో చాలాసేపు వేచి చూడాల్సి వచి్చంది. మాజీ మెడికల్‌ సూపరింటెండెంట్, వైస్‌ ప్రిన్సిపల్‌ సంజయ్‌ వశిష్‌్ట, మరో ప్రొఫెసర్, ఇంకో 12 మందికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేశారు. ఆస్పత్రికి ఔషధాలు, ఇతర ఉపకరణాలను సరఫరాచేసే వారి ఆఫీసుల్లో సోదాలు చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)