Breaking News

అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి

Published on Sun, 05/12/2024 - 04:56

ఖమ్మం సహకారనగర్‌: బీటెక్‌ పూర్తిచేశాక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం వచ్చినా కాదను కున్న యువకుడు ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఇటీవలే కోర్సు పూర్తికాగా, కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు తల్లి దండ్రులూ అమెరికా వెళ్లారు. పట్టా స్వీకరించిన సంతోషంలో స్నేహితులతో కలిసి విహారయాత్ర కు వెళ్లిన ఆ యువకుడు అక్కడి జలపాతంలో మునిగి మృతి చెందగా.. కొడుకు మృతదేహంతో స్వస్థలానికి వెళ్లాలని తెలిసిన ఆ తల్లిదండ్రుల రోదనకు అంతు లేకుండా పోయింది. 

ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంలోని మాంటిస్సోరి పాఠశాలల డైరెక్టర్‌ లక్కిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఏకైక కుమారుడు రాకేశ్‌ (24) రెండేళ్ల క్రితం బీటెక్‌ పూర్తిచేయగా అమెజా న్‌లో ఉద్యోగం వచ్చింది. అయినా ఎంఎస్‌ చదవా లనే లక్ష్యంతో అమెరికా వెళ్లాడు. అక్కడ అరిజోనా యూనివర్సిటీ నుంచి ఎంఎస్‌ పూర్తిచేసిన ఆయన వారం క్రితం పట్టా స్వీకరించారు. 

కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు చంద్రశేఖర్‌రెడ్డి దంపతులు అమెరికా వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అయితే, ఎంఎస్‌ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా అమెరికాలోని ప్రసిద్ధ ఫాసిల్‌ క్రీక్‌ జలపాతం వద్దకు రాకేశ్, ఆయన స్నేహితులు ఈనెల 8వ తేదీన వెళ్లారు.

జలపాతం వద్ద సరదాగా గడుపుతుండగా రాకేశ్‌తో పాటు మరో యువకుడు ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోయారు. గాలింపు చర్యలు చేపట్టగా మరుసటిరోజు 25 అడుగుల లోతులో మృతదే హాలు లభించాయి. రాకేశ్‌తో పాటు మృతి చెందిన మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)