Breaking News

వేట కొడవళ్లతో నరుక్కున్న నవ దంపతులు!

Published on Fri, 08/09/2024 - 06:02

కేజీఎఫ్‌/కోలారు: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ పెళ్లయిన రోజే ఏకాంతంగా ఉన్న సమయంలో ఇద్దరూ ఒకరిని ఒకరు వేట కొడవళ్లతో నరుక్కుని ప్రాణాలు తీసుకున్నారు. కర్ణాటకలోని కోలారు జిల్లా కేజీఎఫ్‌ పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కేజీఎఫ్‌ తాలూకా బైనేహళ్లికి చెందిన శ్రీనివాసులు, లక్ష్మి దంపతుల కుమార్తె లిఖితశ్రీ(19), చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని సంతూరు నివాసి మునియప్ప కుమారుడు నవీన్‌కుమార్‌­(27)లు ప్రేమించుకున్నారు.

పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. లిఖితశ్రీ ఇంటర్‌ పూర్తి చేయగా, నవీన్‌ దుస్తుల షాపు నిర్వహిస్తున్నాడు. కాగా, బుధవారం ఉదయం కర్ణాటక చండరసనహళ్లిలోని నవీన్‌కుమార్‌ సోదరి ఇంట్లో వారిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు సంతోషంగా పాల్గొన్నారు. సాయంత్రం అదే గ్రామంలో ఉన్న నవీన్‌కుమార్‌ పెదనాన్న ఇంటికి కొత్త జంట వెళ్లింది. ఒక గదిలో విశ్రాంతి తీసుకునే సమయంలో నవ దంపతులు గొడవ పడ్డారు, గట్టిగా కేకలు వేయడంతో బంధువులు తలుపులు తెరిచి చూడగా ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు.

ఇద్దరూ ఆ గదిలో ఉన్న వేట కొడవళ్లతో దాడి చేసుకున్నారని అనుమానాలున్నాయి. వధువు లిఖితశ్రీ ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే మరణించింది. తీవ్ర గాయాలతో ఉన్న నవీన్‌ కుమార్‌ను అంబులెన్స్‌లో కోలారు ఆస్పత్రికి, అనంతరం బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించగా.. గురువారం ఉదయం ప్రాణాలు విడిచాడు. ఇలా కొత్త జంట కొన్ని గంటలకే ఈ లోకాన్ని వీడింది. జిల్లా ఎస్పీ శాంతరాజు, డీఎస్పీ పాండురంగ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నవదంపతులు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టమని ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు తెలిపారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)