Breaking News

మావోయిస్టు కీలకనేత బిచ్చు లొంగుబాటు  

Published on Mon, 06/24/2024 - 03:50

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలకనేతల్లో ఒకరైన నంగ్సు తుమ్రెట్టి అలియాస్‌ గిరిధర్‌ ఆలియాస్‌ బిచ్చుతోపాటు ఆయన భార్య లలితా ఉసెండీ అలియాస్‌ సంగీత ఆదివారం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ సమక్షంలో లొంగిపోయారు. గడ్చిరోలి జిల్లా ఎటపల్లి తాలూకాకు చెందిన బిచ్చు 1997లో మావోయిస్టు పార్టీలో చేరి అంచలంచెలుగా ఎదిగారు. 

దాడులు చేయడంలో దిట్టగా పేరున్న కంపెనీ–4కు కమాండర్‌గా బిచ్చు వ్యవహరించారు. ఆ తర్వాత దక్షిణ గడ్చిరోలి జిల్లా కార్యదర్శి, కమాండర్‌ హోదాలో బిచ్చు మావోయిస్టు పార్టీలో కొనసాగారు. ఇప్పటి వరకు ఆయనపై 179 కేసులు నమోదు కాగా, అందులో ఎదురుకాల్పులకు సంబంధించినవి 86 వరకు ఉన్నాయి. బిచ్చుపై రూ.25లక్షల రివార్డు ఉంది. బిచ్చు భార్య సంగీతపై 18 కేసులుండగా, రూ.16 లక్షల రివార్డు ఉంది. 

రిక్రూట్‌మెంట్లు తగ్గిపోయాయి : ఫడ్నవిస్‌
గడిచిన నాలుగేళ్లలో గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్‌మెంట్లు గణనీయంగా తగ్గిపోయాయని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ అన్నారు. గడిచిన నాలుగేళ్లలో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లకు ఈ జిల్లా నుంచి 28 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. 

మావోయిస్టుల కంటే ప్రభుత్వానికే ప్రజల మద్దతు ఎక్కువగా ఉందనేందుకు ఇది ఉదాహరణ అన్నారు. డీఐజీ అంకిత్‌గోయల్‌ మాట్లాడుతూ 2021 నుంచి జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో గడ్చిరోలి జిల్లాలో 65 మంది మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు ఉన్నారన్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)