Breaking News

హ్యాండర్లతో టచ్‌లో ఉంటూ బాంబు పేలుళ్లకు కుట్ర చేశాం!

Published on Wed, 05/28/2025 - 17:48

విజయనగరం:  ఉ‍గ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసుకు సంబంధించి పోలీసుల విచారణ ముగిసింది.  ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సిరాజ్, సమీర్ లను ఆరు రోజుల పాటు విచారించారు పోలీసులు. ఈ రోజు(బుధవారం) వైద్య పరీక్షల అనంతరం వీరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. అయితే పోలీసుల విచారణలో పలు చోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకరించాడు.  దీనిలో భాగంగా పలు దేశాల హ్యాండర్లు టచ్ లో ఉన్నట్లు సిరాజ్ స్పష్టం చేశాడు.

ఉ‍గ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్‌ అరెస్ట్‌ తర్వాత విజయనగరంలో అదృశ్యమైన వారు ఎవరు?. హైదరాబాద్‌లో సమీర్‌ ఇంట్లో సమావేశమైన వారు ఇప్పుడు ఎక్కడ?’’ అనే వివరాలను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులు పురోగతి సాధించినట్లు కనబడుతోంది.

బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సూత్రధారి సిరాజేనని, దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు వ్యూహరచన చేశాడని నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) విచారణలో తేలినట్టు సమాచారం. ఉగ్రవాద భావజాలం, పేలుడు పదార్థాలు కలిగిన హైదరాబాద్‌కు చెందిన సమీర్, విజయనగరం జిల్లా ఆబాద్‌వీధికి చెందిన సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌ను ఈ నెల 16న కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ ఆరు రోజులు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయనగరం పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలలో ఎన్‌ఐఏ, స్థానిక పోలీస్‌ అధికారులు విచారించారు.

Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం

ఆరు రోజుల పాటు విచారణలో తొలి మూడు రోజులు నోరు విప్పని సిరాజ్‌, సమీర్‌లు.. ఆ తర్వాత కీలక విషయాలను బహిర్గతం చేయక తప్పలేదు.  ప్రధానంగా పేలుళ్లకు పథకం ర.చన చేసింది సిరాజేనని సమీర్‌ స్నష్టం చేశాడు. అయితే దీనిపై ఈరోజు(బుధవారం) సిరాజ్‌ను పోలీసులు విచారించగా నిజాన్ని అంగీకరించాడు. బాంబు పేలుళ్లకు పథకం రచన చేసింది తానేనని చెప్పుకొచ్చాడు. పల ఉగ్ర కుట్ర హ్యాండర్లతో టచ్‌ లో ఉంటూ బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలిపాడు. 

ఇదిలా ఉండగా, సౌదీలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన సిరాజ్, హైదరాబాద్‌లో ఉంటూ తరచూ సౌదీతోపాటు ఓమెన్‌ దేశాలకు వెళ్లినట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. వరంగల్‌కు చెందిన ఫర్హన్, ఢిల్లీకి చెందిన బాదర్, సౌదీకి చెందిన ఇమ్రాన్‌తో మిలాఖత్‌ అయ్యి పాకిస్థాన్‌కు చెందిన ఓ ముస్లిం సంస్థతో టై అప్‌ అయినట్టు సమాచారం. అహీం గ్రూప్‌ ద్వారా ఆ సంస్థతో సిరాజ్‌  ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ భారీ కుట్రకు ప్లాన్‌ చేసినట్లు వెల్లడైంది.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)