Breaking News

అంతర్‌ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్‌ 

Published on Fri, 04/21/2023 - 05:19

నెల్లూరు(క్రైమ్‌): ఖమ్మం ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి నెల్లూరు, తమిళనాడులో విక్రయాలు సాగిస్తున్న ఓ ముఠా గుట్టును నెల్లూరు ఎస్‌ఈబీ అధికారులు రట్టు చేశారు. ముఠాలోని ఏడుగురు సభ్యులతోపాటు నలుగురు వినియోగదారులను అరెస్ట్‌ చేసి వారివద్ద నుంచి రూ.15.83 లక్షలు విలువచేసే గంజాయి, కారు, 10 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్‌ కె.తిరుమలేశ్వరరెడ్డి ఈ కేసు వివరాలను గురువారం వెల్లడించారు. చెన్నై ఆంజనేయనగర్‌ ఆరో వీధికి చెందిన రాఘవన్‌ కావలిలో తన అత్త వద్ద ఉంటున్నాడు.

అతను ఖమ్మం జిల్లా భద్రాచలంలోని పేపర్‌మిల్లులో పనిచేస్తున్న సమయంలో గంజాయి సరఫరాదారులైన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం శారపాక గ్రామానికి చెందిన యు.బాలమురళీకృష్ణ, కె.సురేష్తో పరిచయం ఏర్పడింది. వారు ఏవోబీలో గంజాయి కేజీ రూ.3 వేలకు కొనుగోలు చేసి రూ.7,500కు రాఘవన్‌కు విక్రయించారు. ఆయన కావలితోపాటు తమిళనాడు రాష్ట్రంలో కేజీ రూ.15 వేలు చొప్పున విక్రయించి సొమ్ము చేసుకోసాగాడు.

ప్రస్తుతం రాఘవన్‌ దంపతులు కావలి తుఫాన్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డికి సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఎస్‌ఈబీ జిల్లా ఇన్‌చార్జ్‌ డి.హిమవతి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ హుస్సేన్‌బాషా, నెల్లూరు–1, కావలి ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌లు కేపీ కిశోర్, శ్రీనివాసరావు తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు. గురువారం తుఫాన్‌నగర్‌లో రాఘవన్‌ దంపతులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం వారిచ్చిన సమాచారం మేరకు శారపాకకు చెందిన బాలమురళీకృష్ణ, సురేష్, తరుణ్, దుమ్మగూడు మండలం తూరుబాక గ్రామానికి చెందిన సతీష్ను అరెస్ట్‌చేసి వారి వద్ద నుంచి 25 కేజీల గంజాయిని, కారును స్వాదీనం చేసుకున్నారు. అలాగే కావలిలోని బాలకృష్ణారెడ్డినగర్‌లో గంజాయి విక్రయదారురాలైన డి.శారదను అరెస్ట్‌ చేసి ఆమె వద్ద నుంచి 2 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు.  

నలుగురు వినియోగదారులు 
అదే క్రమంలో రాఘవన్‌ దంపతులు, శారదల వద్ద కావలిలోని పాతూరుకు చెందిన డి.చైతన్య, వెంగళరావ్‌నగర్‌కు చెందిన వై.లక్ష్మీప్రవీణ్‌కుమార్, ఆంధ్రావీధికి చెందిన జి.శ్రీకాంత్, శివాలయం ప్రాంతానికి చెందిన పి.ఎం.శ్రీనివాసులు గంజాయిని కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు తెలియడంతో వారిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 4.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

#

Tags : 1

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)