Breaking News

నాన్న కాదు.. న‌ర‌హంత‌కుడు..

Published on Thu, 03/06/2025 - 12:20

దారుణాతి దారుణం.. ఘోరాతి ఘోరం.. క‌న్న‌తండ్రే కూతురికి స్వ‌యంగా మ‌ర‌ణ‌శాస‌నం రాశాడు. ద‌గ్గ‌రుండి మ‌రీ క‌న్న‌బిడ్డ‌ను కాటికి పంపాడు. క‌ళ్లెదుట క‌న్న‌కూతురు ప్రాణాలు పోతున్నా ఆ పాష‌ణ హృదయం క‌ర‌గలేదు. ప్రేమించిన వాడిని మ‌రిచిపోలేన‌ని చెప్పిన పాపానికి కూతురిని క‌ర్క‌శంగా బ‌లితీసుకున్నాడో న‌ర‌హంతక తండ్రి. ఈ అవ‌మానవీయ ఘ‌ట‌న గురించి తెలిసిన వారంద‌రూ భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇలాంటి స‌మాజంలో ఉన్నందుకు సిగ్గుతో త‌ల‌దించుకుంటున్నారు.

గుంతకల్లు రూరల్‌: కుమార్తె ప్రేమ వ్యవహారం (love affair) కారణంగా కుటుంబ పరువు, మర్యాద మంటగలసి పోతున్నాయనే ఉద్దేశంతో కన్న కూతురినే కడతేర్చాడో తండ్రి. అనంతపురం జిల్లా (Anantapur District) గుంతకల్లులో ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. గుంతకల్లు పట్టణంలోని తిలక్‌ నగర్‌లో నివాసం ఉంటున్న తుపాకుల రామాంజనేయులు, సావిత్రి దంపతులకు నలుగురు కుమార్తెలు. హోటల్‌ నిర్వహణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు ఇదివరకే వివాహం చేశారు. చివరి కుమార్తె భారతి (20) కర్నూలులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈమె ఇంటికి సమీపంలోనే ఉంటున్న యువకుడిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారిస్తూ వచ్చారు. ఎంతకూ వారి మాట వినని భారతి ‘చావనైనా చస్తాను గానీ ప్రేమించిన యువకుడిని మరచిపోలేన’ని తెగేసి చెప్పింది.  

నిర్మానుష్య ప్రాంతంలో ఘాతుకం..
తండ్రి రామాంజనేయులు ఈ నెల ఒకటో తేదీన కుమార్తెతో మరోమారు మాట్లాడి.. ఆమె మనసు మార్చే ప్రయత్నం చేశాడు. అయినా వినకపోవడంతో తనతో పాటు ఒక తాడును తీసుకొని కుమార్తెను స్కూటర్‌పై తీసుకొని కసాపురం గ్రామ శివారులోని తిక్కస్వామి తోట సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. తాడుతో అక్కడి చెట్టుకు ఉరితాడు సిద్ధం చేశాడు. ఇప్పటికైనా మాట వింటావా లేక చస్తావా అని అడిగాడు. తాను చావడానికైనా సిద్ధమని స్పష్టం చేయడంతో ‘సరే చావు’ అంటూ ఆమెను ఎత్తి పట్టుకున్నాడు. వెంటనే ఆ అమ్మాయి చెట్టుకు వేలాడుతున్న ఉరితాడును తన మెడకు వేసుకుంది.

కుమార్తెను మరోసారి బతిమాలిన రామాంజనేయులు ఆమె మాట వినకపోవడంతో ఉరికి వదిలేసి.. వెనక్కు తిరిగి చూడకుండా ముందుకు కదిలాడు. కొంత దూరం వచ్చాక తిరిగి వెనక్కు వెళ్లి చూడగా అప్పటికే భారతి విగతజీవిగా ఉరికి వేలాడుతోంది. దీంతో మృతదేహాన్ని కిందకు దింపి తన స్కూటర్‌లోని పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నాడు. మూడు రోజుల తర్వాత ఈ నెల నాల్గో తేదీన గుంతకల్లు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి.. కుమార్తెను చంపేశానని చెప్పి లొంగిపోయాడు.

చ‌ద‌వండి: పాపం శిరీష‌.. ఆడ‌ప‌డుచు క‌ప‌ట‌ ప్రేమ‌కాటుకు బ‌లైంది

కసాపురం శివారులో ఘటన జరిగినట్లుగా తెలపడంతో రామాంజనేయులుతో కలిసి రూరల్‌ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ టీపీ వెంకటస్వామి, పోలీసులు మంగళవారం రాత్రి 9.30 గంటల వరకూ గాలింపు చేపట్టినా ఘటనా స్థలాన్ని గుర్తించలేకపోయారు. దీంతో బుధవారం ఉదయం మరోమారు గాలించి సంఘటన స్థలాన్ని గుర్తించారు. కాలిన మృతదేహాన్ని కొంతమేర కుక్కలు పీక్కు తిన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడే పోస్టుమార్టం నిర్వహింపజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)