Breaking News

మమ్మీ.. డాడీ ఐయామ్‌ సారీ..

Published on Wed, 04/12/2023 - 11:04

వరంగల్: ‘మమ్మి, డాడీ ఐయామ్‌ సారీ... నాకు ఎంబీబీఎస్‌ సీటు రాదెమోనని అనిపిస్తుంది’అని సూసైడ్‌ నోట్‌ రాసిన ఓ ఇంటర్‌ విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం పీక్లాతండాజీపీ శివారు బోడగుట్టతండాలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం..తండాకు చెందిన గుగులోతు లచ్చు, జ్యోతి దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులున్నారు.

పెద్దకుమారుడు కృష్ణ(19) ఏటూరునాగారంలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ కాలేజీలో ఇంటరీ్మడియట్‌(బైపీసీ) చదివి, ఇటీవల పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. ఎంబీబీఎస్‌ సీటు సాధించాలనే లక్ష్యం ఉన్న కృష్ణ, ఇంట్లో గోడలపై ఎంబీబీఎస్‌ నా డ్రిమ్‌ అంటూ రాసుకున్నాడు. ఈ మేరకు నీట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. ఈక్రమంలో తల్లి పంటచేను వద్దకు వెళ్లగా, తండ్రి కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి అమ్మేందుకు వెళ్లాడు. తమ్ముడు ప్రభాకర్‌ పదవ తరగతి పరీక్ష రాసేందుకు కల్వల మోడల్‌ స్కూల్‌కి వెళ్లాడు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న కృష్ణ, తనకు ఎంబీబీఎస్‌ సీటు రాదెమోనని మనస్తాపం చెంది, ఐయామ్‌ సారీ మమ్మి, డాడీ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తాత ఇంట్లోకి వచ్చి చూడగా ఉరివేసుకుని కనిపించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని, కొడుకు మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)