Breaking News

టీడీపీ నేత కాలేజీలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

Published on Wed, 09/18/2024 - 05:02

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ నేత గోరంట్ల రవికుమార్‌కు చెందిన శ్రీహర్షిణి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న వడ్డిముక్కల భావన(16) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామానికి చెందిన వడ్డిముక్కల చిన బ్రహ్మయ్య, ధనలక్ష్మి దంపతుల చిన్న కుమార్తె భావన. వినాయక చవితి సెలవుల సందర్భంగా భావన 4వ తేదీన ఇంటికి వెళ్లింది. తిరిగి 16 మధ్యాహ్నం కాలేజీకి వచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో తల్లికి ఫోన్‌ చేసి మాట్లాడింది. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో గానీ కళాశాల టెర్రస్‌పై ఉన్న షెడ్డు కప్పునకు ఉన్న ఫ్యాన్‌కు తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

ఉరికి వేలాడుతున్న భావనను మంగళవారం ఉదయం విద్యార్థినులు చూసి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారొచ్చి భావనను కిందకు దింపడంతో అప్పటికే బాలిక మృతి చెందింది. వెంటనే ఆమె తల్లికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. ఫీజులు కట్టాలంటూ కాలేజీ యాజమాన్యమే వేధించి తన బిడ్డను పొట్టనపెట్టుకుందని ఆమె కన్నీటిపర్యంతమైంది. బాలిక తల్లి ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ సీఐ నాగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భావన తండ్రి పదేళ్ల కిందట చనిపోవడంతో తల్లి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలనూ పోషిస్తోంది. 

కాగా, కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలిసి కూడా గోరంట్ల రవికుమార్‌ పత్తా లేకుండా పోయారు. ఆయనతో పాటుగా కళాశాల హెచ్‌ఆర్‌ సురే‹Ù, కేర్‌ టేకర్‌ చాముండేశ్వరి కూడా కనిపించలేదు. కళాశాల ప్రిన్సిపాల్‌కు బదులుగా డీన్‌ ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఒక్కసారిగా వీరంతా కనిపించకుండా పోవడంపై మృతురాలి సోదరి ఐశ్వర్య అనుమానం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు బత్తుల పద్మావతి బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. కళాశాల చైర్మన్‌ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల నిర్వాహణ లోపాలపై ప్రశి్నంచారు. మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. భావన ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వినోద్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)