Breaking News

ప్రీ లాంచ్‌ ఆఫర్స్‌ పేరుతో భారీ స్కామ్‌

Published on Sat, 11/23/2024 - 07:56

సాక్షి, సిటీబ్యూరో: నగర శివార్లలోని వెంచర్స్‌లో ప్రీ లాంచ్‌ ఆఫర్ల పేరుతో 600 మంది నుంచి దాదాపు రూ.150 కోట్లు వసూలు చేసి మోసం చేసిన ఆర్‌ హోమ్స్‌ నిర్వాహకులపై బాధితులు శుక్రవారం సైబరాబాద్‌ ఈఓడబ్ల్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు బాధితులు హైదరాబాద్‌ సీసీఎస్‌ను ఆశ్రయించి, ఆ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆర్‌ హోమ్స్‌ సంస్థ, దాని వెంచర్లు సైతం సైబరాబాద్‌ పరిధిలో ఉండటంతో పోలీసులు వారిని అక్కడికి పంపించారు. 

 కూకట్‌పల్లి కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థకు భాస్కర్‌ గుప్తా ఎండీగా, ఆయన భార్య సుధారాణి డైరెక్టర్‌గా ఉన్నారు. వీళ్లు జై వాసవి బ్లిస్‌ హైట్స్‌ సహా అనేక ప్రాజెక్టులు చేపట్టారు. ప్రీ లాంచ్‌ ఆఫర్‌ పేరుతో చదరపు అడుగు రూ.2,199కి ఇస్తున్నట్లు 2020 నవంబర్‌లో ప్రకటించారు. కొనుగోలుదారులను ఆకర్షించడానికి కపిల్‌ దేవ్‌ (క్రికెటర్‌),  ప్రసాద్‌ (క్రికెటర్‌), కోటి (మ్యూజిక్‌ డైరెక్టర్‌) తదితర ప్రముఖులతో ప్రచారం చేయించారు. దీంతో అనేక మంది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి చెందినవారు సొంతింటి కలను నెరవేర్చుకోవాలని వీరి వద్ద ఫ్లాట్లు బుక్‌ చేసుకున్నారు. 

దాదాపు 600 మంది రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల చొప్పున చెల్లించారు. రెండు నెలల్లో ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను పొందుతామని, 2023 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని భాస్కర్‌ గుప్తా, సుధారాణిలు నమ్మించారు. నిర్మాణంలో జాప్యంపై బాధితులు ప్రశ్నించచడంతో ధరణి, ఎన్నికలు సహా అనేక కారణాలు చెబుతూ వారు తప్పించుకున్నారు. ఈ సంస్థ ప్లాట్లు కూడా విక్రయిస్తామని, తమకు శివార్లలో అనేక చోట్ల భూములు ఉన్నాయని అవసరమైతే బాధితులకు వాటిని కేటాయిస్తామని నమ్మించింది. నారాయణ్‌ఖేడ్‌ , ఘట్‌కేసర్, పఠాన్‌ చెరు, కర్తనుర్‌ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్స్, ఫార్మ్‌ ల్యాండ్‌ పేరిటా వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం.    

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)