Breaking News

ఐసిస్‌తో లింకులు.. గువాహటి ఐఐటీ విద్యార్థి అరెస్ట్‌

Published on Mon, 03/25/2024 - 05:06

గువాహటి: అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై గువాహటి–ఐఐటీకి చెందిన తౌసిఫ్‌ అలీ ఫరూకీ అనే విద్యారి్థని అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీటెక్‌ బయోసైన్స్‌ నాలుగో సంవత్సరం చదువుకుంటున్న ఇతడిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ)చట్టం ఉపా కింద కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన అనంతరం ఐసిస్‌తో సంబంధాలున్నట్లు పక్కా ఆధారాలు దొరకడంతో శనివారం అరెస్ట్‌ చేసినట్లు అస్సాం పోలీస్‌           టాస్‌్కఫోర్స్‌ ఐజీ పార్థసారధి మహంతా చెప్పారు.

కోర్టు అతడిని 10 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చిందన్నారు. ఢిల్లీలోని బాట్లా ప్రాంతానికి చెందిన అతడు ఐసిస్‌లో చేరేందుకు వెళ్తుండగా కామ్‌రూప్‌ జిల్లా హజో వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. మూడు రోజుల క్రితం బంగ్లాదేశ్‌ నుంచి వచి్చన ఐసిస్‌ భారత్‌ చీఫ్‌ హారిస్‌ ఫరూకీ, అతడి అనుచరుడు అనురాగ్‌ సింగ్‌ అలియాస్‌ రేహాన్‌లను ధుబ్రి జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఐజీ వివరించారు.

అయితే, గువాహటి ఐఐటీకి చెందిన ఇద్దరు విద్యార్థులకు ఐసిస్‌తో సంబంధాలున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తనకు సమాచారం ఇచి్చనట్లు హోం శాఖ బాధ్యతలు కూడా చూసుకుంటున్న సీఎం హిమాంత బిశ్వ శర్మ చెప్పారు. ఇద్దరిలో ఒక్కరు మాత్రమే దొరికారని, తప్పించుకుపోయిన మరో విద్యార్థిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఉగ్రవాదం వైపు ప్రేరేపితులైన వీరి గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు  సీఎం చెప్పారు. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)