Breaking News

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌ 590 కోట్ల కుంభకోణం కేసు.. ఇంటి దొంగలు దొరికారు!

Published on Thu, 02/26/2026 - 02:33

చండీఘడ్‌: హర్యానా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌ రూ. 590 కోట్ల కుంభకోణం కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారులు తీగ లాగితే కుంభకోణం డొంకంత కదులుతోంది. తాజాగా, ఈ కేసులో ఇద్దరు మాజీ ఉద్యోగులు, నలుగురు బయటి వ్యక్తులను హర్యానా రాష్ట్ర విజిలెన్స్‌, అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు.

పంచకులాలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏఎస్ చావ్లా మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్కామ్‌కి మాస్టర్‌ మైండ్స్‌గా మాజీ మేనేజర్లు రిభవ్ రిషి, అభయ్ కుమార్‌లను గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేసిన ఈ కేసులో తాజాగా రిభవ్ రిషి, అభయ్ కుమార్, స్వాతి సింగ్లా, అభిషేక్ సింగ్లాలను అదుపులోకి తీసుకున్నారు.

బ్యాంక్‌ ఫ్రాడ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా రిభవ్ రిషి అనే మాజీ మేనేజర్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ఏయూ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్‌లో పనిచేస్తున్నప్పటికీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో పనిచేసిన సమయంలోనే ఈ స్కామ్‌ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనతో పాటు అభయ్ కుమార్, స్వాతి సింగ్లా, అభిషేక్ సింగ్లా అనే వ్యక్తులు కూడా ఈ మోసంలో భాగమని విచారణలో తేలింది.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో హర్యానా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌తో పాటు ఏయూ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్‌ను కూడా ప్రభుత్వ లావాదేవీల నుండి తొలగించింది. అన్ని ప్రభుత్వ నిధులను ఇతర బ్యాంకులకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.

బ్యాంక్‌ కుంభకోణం యాజమాన్యానికి తలొంపు కాగా..  బ్యాంక్ షేర్‌ మార్కెట్‌పై కూడా తీవ్రంగా పడింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌ షేర్లు ఒక్క రోజులోనే 20 శాతం పడిపోయాయి. పెట్టుబడిదారుల సంపదలో రూ.14వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగినట్లు అంచనా.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)