Breaking News

వనస్థలిపురం ఘటనలో స్నేహితుడి అరెస్ట్‌

Published on Wed, 07/31/2024 - 07:46

హస్తినాపురం: తనను నమ్మి వచ్చిన చిన్ననాటి స్నేహితురాలికి మద్యం తాగించి.. స్నేహితుడితో కలిసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఏసీపీ పి.కాశిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని, గౌతంరెడ్డి అనే యువకుడు పాఠశాల స్నేహితులు. యువతికి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం రావడంతో పార్టీ చేసుకునేందుకు సోమవారం రాత్రి 7.30కు వీరిద్దరూ కలిసి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓంకార్‌ నగర్‌ కాలనీలోని బొమ్మరిల్లు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరూ మద్యం తాగారు.

.. ఆ తర్వాత ఇదే రెస్టారెంట్‌లో గౌతంరెడ్డి గది అద్దెకు తీసుకుని యువతిని తీసుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తన స్నేహితుడిని కూడా గదికి పిలిచాడు. ఇద్దరు కలిసి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తు నుంచి తేరుకున్న యువతి గదిలో గౌతంరెడ్డి తో పాటు మరో వ్యక్తి ఉండడంతో తనపై లైంగిక దాడి జరిగిందన్న విషయాన్ని గమనించి గట్టిగా కేకలు వేసింది. దీంతో కంగారు చెందిన ఇద్దరు యువకులు అక్కడ నుంచి పారిపోయారు.

.. బాధితురాలు విషయాన్ని రెస్టారెంట్‌ సిబ్బంది దృష్టి తీసుకెళ్లగా వారు ఆమె స్నేహితులకు సమాచారం అందించారు. వెంటనే యువతి స్నేహితులు రెస్టారెంట్‌కు వచ్చి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు గౌతంరెడ్డిని అదుపులోకి తీసుకున్నామని, మరో నిందితుడు శివాజీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని ఏసీపీ కాశిరెడ్డి వెల్లడించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)