Breaking News

నార్సింగ్‌: అతివేగం.. తొమ్మిది కుటుంబాల్లో విషాదం!

Published on Fri, 05/19/2023 - 21:32

సాక్షి, హైదరాబాద్‌: అంతా 20 ఏళ్లలోపు వాళ్లే. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి.. సెలవుల్లో ఉన్నారు. సరదాగా రిసార్ట్‌ వెళ్లి వద్దామని బయటకు వచ్చారు. చిన్న వయస్సు కావటం.. కారు డ్రైవింగ్ లో అనుభవం లేకపోవటం ఒకటి అయితే.. ఓవర్ స్పీడ్.. తొమ్మిది కుటుంబాల్లో విషాదం నింపింది. 

నగరంలోని నార్సింగ్‌లో ఈరోజు(శుక్రవారం, మే 19) ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతులంతా నిజాంపేట్‌కు చెందిన వారుగా పోలీసులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో కారులో 12 మంది ఉండగా.. అందరూ 20 ఏళ్లలోపు వాళ్లేనని పోలీసులు చెబుతున్నారు.  వీరంతా నిజాంపేట్ నుంచి ఓషెన్‌ పార్క్‌కు వెళ్తుండగా నార్సింగ్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. 

శుక్రవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న కారు.. టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొక విద్యార్థి మృతిచెందాడు. ప్రసాద్ అనే కుర్రాడు డ్రైవింగ్ చేస్తున్నాడు. నితిన్, హర్షిత, అంకిత ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులు హర్షిత, అంకిత అక్కా చెల్లెళ్లు. అయితే యాక్సిడెంట్‌లో బ్రెయిన్ బయటకు రావడంతో డ్రైవర్ ప్రసాద్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. మృతురాలు హర్షిత తన తండ్రి కారును తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. హుషారుగా బయటకు వెళ్లొస్తామంటూ చెప్పిన తమ బిడ్డలు ఇలా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

రైట్‌ సైడ్‌ అక్కడికక్కడే..
ప్రమాద సమయంలో కారులో మొత్తం 12 మంది ఉన్నారు. వారిలో కారు ముందు సీట్లో డ్రైవింగ్‌ చేసిన ప్రసాద్‌తో పాటు ఇద్దరు విద్యార్థులు కూర్చున్నారు. కారు మధ్య సీట్లో ఐదుగురు, ఆ వెనుక సీట్లో మరో నలుగురు కూర్చున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ పొజిషన్‌కు రైట్‌ సైడ్‌ కూర్చున్న నలుగురు మృతి చెందారు. ప్రసాద్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా ఫలితం లేకుండా పోయింది. కారు నుజ్జునుజ్జు అయ్యింది.  

యాక్సిడెంట్ జరిగిన వెంటనే కారులోనే హర్షిత, అంకిత అనే సొంత అక్కాచెల్లెళ్లు చనిపోయారు. దీంతో ఆ ఇంట పెను విషాదం నెలకొంది. మిగతా వాళ్లకూ త్రీవ గాయాలు అయ్యాయి.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)