Breaking News

సెల్ఫ్‌ డ్రైవ్‌ పేరిట ఘరానా మోసం

Published on Tue, 12/03/2024 - 07:36

గచ్చిబౌలి: సెల్ఫ్‌ డ్రైవ్‌ పేరుతో కార్లు అద్దెకు తీసుకుని మరొకరి వద్ద కుదవపెట్టిన మహిళతో పాటు మరో ముగ్గురిని రాయదుర్గం పోలీసులు  అరెస్ట్‌ చేశారు. సోమవారం గచ్చిబౌలిలోని మాదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ డాక్టర్‌ వినీత్‌ వివరాలు వెల్లడించారు. గచ్చిబౌలి టెలికాంనగర్‌లో నివాసం ఉంటున్న జుపూడి ఉషా సెల్ఫ్‌ డ్రైవ్‌ కోసం కార్లు అద్దెకు ఇస్తే రోజుకు రూ.2 నుంచి రూ.5 వేల వరకు అద్దె చెల్లిస్తానని ప్రచారం చేసుకుంది. 

దీంతో పలువురి నుంచి కార్లు తీసుకున్న ఆమె డ్రైవర్‌ తుడుముల మల్లేష్‌తో కలిసి వాటిని బీదర్‌కు చెందిన సాగర్‌ పాటిల్, అనీల్‌ జమానే వద్ద తనఖా పెట్టి రూ.50 లక్షలు తీసుకుంది. ఆవే కార్లను సాగర్, అనీల్‌ బీదర్, బల్కీ జిల్లాల్లో ఇతర వ్యక్తుల వద్ద కుదువపెట్టి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. మూడు నెలలైనా అద్దె డబ్బులు ఇవ్వక పోవడంతో కార్ల యజమానులు ఉషాను నిలదీయగా ఇప్పుడు, అప్పుడు అంటూ కాలయాపన చేస్తుంది. అద్దె ఇవ్వక పోవడం,  కార్ల ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనకు గురైన బాధితులు  రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. 

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జియో ట్యాగ్‌ను తొలగించి కార్లను కర్నాటకలోని బీదర్, బల్కీ జిల్లాలకు తరలించినట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వెల్లడించారు.దీంతో నిదితులు ఉషా, మల్లేష్‌, సాగర్, అనిల్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు వారి నుంచి రూ.2.5 కోట్ల విలువైన 21 వాహనాలను స్వా«దీనం చేసుకున్నారు. స్వా«దీనం చేసుకున్న వాహనాల్లో 4 మహీంద్రా థార్, 10 ఎర్టిగా, ఒక ఇన్నోవా క్రిస్టా, 3 స్విఫ్ట్‌ కార్లు, పది ఐ–10 , ఒక ఐ–20,  ఒక వెన్యూ కార్లు ఉన్నాయి. సమావేశంలో మాదాపూర్‌ ఏడీసీపీ జయరాం, ఏసీపీ శ్రీకాంత్, రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న, డీఐ సతీష్‌,  తదితరులు పాల్గొన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)