Breaking News

ఫిలింనగర్‌: ‘అమ్మా.. నేనేం పాపం చేశానమ్మా?’

Published on Sat, 06/24/2023 - 08:58

సాక్షి,  హైదరాబాద్: మూడేళ్లు కూడా నిండని ఆ కొడుకును.. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పైగా కడుపులో మరో బిడ్డ పెరుగుతోంది. అయితే కుటుంబ సమస్యలు.. క్షణికావేశం ఆ తల్లి ఆలోచనా శక్తిని చంపేసినట్లున్నాయ్‌. ఫలితంగా.. ఘోరానికి పాల్పడిందామె.  

నగరంలోని ఫిలింనగర్‌ తల్లీకొడుకుల ఆత్మహత్య ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. అత్తింటి వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే తాను చనిపోతే పిల్లాడి ఆలనా పాలనా చూసుకునేవారు ఎవరూ ఉండరనుకుందో ఏమో.. ఆ తల్లి ఘోరమైన నిర్ణయం తీసుకుంది.  ఆ చిన్నారికి సైతం ఉరేసింది.

విశ్వనాథ్‌, శిరీషలు ఫిలింనగర్‌లోని వినాయక నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీళ్లకు మనీష్‌ అనే కొడుకు ఉన్నాడు. విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులు చాలాకాలంగా శిరీషను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిరీష మరోసారి గర్భం దాల్చింది. మూడు నెలల కడుపుతో ఉన్న ఆమె.. అత్తింటి వారి వేధింపుల్ని భరించలేకపోయింది. శుక్రవారం రాత్రి చిన్నారి మనీష్‌తో పాటు తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.  మృత దేహాలను ఉస్మానియా కి తరలించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ఆమెపై మోజుతో భార్యకు నరకం.. ఫేస్‌బుక్‌ లైవ్‌లోనే.. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)