Breaking News

అన్న కూతురిని ప్రేమిస్తున్నాడని..

Published on Thu, 01/16/2025 - 07:38

అల్వాల్‌: అన్న కూతురిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఓ యువతి చిన్నాన్న ప్రేమించిన యువకుడి ఇంటిపై దాడి చేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించిన సంఘటన అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాచ బొల్లారం గోపాల్‌నగర్‌ ఎరుకల బస్తీలో ప్రకాష్‌ హేమలత దంపతులు తమ కుమారుడు ప్రదీప్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రదీప్‌ అదే ప్రాంతంలోని వివేకానందకు చెందిన బైక్‌ షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. వివేకానంద అన్న కుమార్తెతో ప్రదీప్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 

దీంతో పలుమార్లు   వివేకానంద ప్రదీప్‌ను హెచ్చరించాడు. అయినా ప్రదీప్‌ వైఖరి మార్చుకోకపోవడంతో ఆగ్రహానికి లోనైన వివేకానంద  ప్రదీప్, అతడి కుటుంబసభ్యులను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి పెట్రోల్‌ తీసుకుని ప్రదీప్‌ ఇంటికి వెళ్లాడు. 

ఆ సమయంలో ప్రదీప్‌ ఇంట్లో లేకపోవడంతో ఇంట్లో ఉన్న అతడి తల్లిదండ్రులు ప్రకాష్, హేమలతలతో పాటు ఇంటి తలుపులపై పెట్రోల్‌ చల్లి నిప్పంటించాడు. ఈ ఘటనలో ప్రకా‹Ùకు తీవ్ర గాయాలు కాగా, పక్కింట్లో ఉండే దిలీప్‌ అనే వ్యక్తి కుమార్తె చిన్నారి చాందిని (4) రెండు కాళ్లకు మంటలంటున్నాయి. చిన్నారి చాందినిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, ప్రకాష్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు వివేకానంద పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)