Breaking News

ఆడపిల్లను కన్నావు.. అదనపు కట్నం తెస్తేనే సంసారం

Published on Sun, 09/18/2022 - 02:21

ఖిలా వరంగల్‌: ‘ఆడపిల్లను కన్నావు.. అదనపు కట్నం తెస్తేనే సంసారం’అంటూ కట్టుకున్న భర్తతోపాటు అత్తామామలు వేధించారు. భరించలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన వరంగల్‌ మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్‌ ముష్క శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. వరంగల్‌  విశ్వనాథ కాలనీకి చెందిన చిల్కూరు దేవేందర్‌రెడ్డి కుమార్తె భవానిరెడ్డి (25)కి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దొంగల రాకేశ్‌రెడ్డితో 2020లో వివాహమైంది.

వివాహ సమయంలో కట్నకానుకల కింద రూ.7లక్షల నగదు, 16తులాల బంగారం, ఇతర సామన్లు ఇచ్చారు. వీరికి ఇటీవల కుమార్తె పుట్టింది. దీంతో ‘ఆడపిల్లను కన్నావు.. ఆదనపు కట్నం తెస్తే సంసారం చేస్తా. లేకుంటే వదిలేస్తా. కట్నం తెచ్చేవరకు తల్లిగారింటి దగ్గరే ఉండు’అంటూ భర్త రాకేశ్‌రెడ్డి వేధించడం మొదలుపెట్టాడు. ఈ నెల 16న కూడా భర్త, అత్తామామలు ఫోన్‌ చేసి మరీ హెచ్చరించారు. దీంతో భవాని అదేరోజు ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. తల్లిదండ్రులు ఆమెను  ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. భవాని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)