రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు.. పట్టుబడ్డ రూ. 2 కోట్ల 47 లక్షలు..

Published on Thu, 10/12/2023 - 04:32

సాక్షి నెట్‌ వర్క్‌: ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత  చేపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం వివిధ ప్రాంతాల్లో సరిగ్గా లెక్క చూపని, సరైన పత్రాల్లేని రూ. 2,47,30,500 నగదు, కేజీ 600 గ్రాముల బంగారం పట్టుబడ్డాయి. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆయా నగదును, బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. 

మంచాల: రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆగాపల్లి వద్ద మంచాల మండలం లోయపల్లికి చెందిన కె.శ్రీనివాస్‌ కారులో రూ.20 లక్షలు, కూకట్‌పల్లికి చెందిన సీహెచ్‌ రాజశేఖర్‌రెడ్డి కారులో రూ.2లక్షలు పట్టుబడ్డాయి. 

చిక్కడపల్లి: నిర్మల్‌ జిల్లా బైంసా ప్రాంతానికి చెందిన శ్రీధర్‌ తన కియా కారులో కేజీ బంగారం తీసుకువెళ్తుండగా గాం«దీనగర్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. రూ.58 లక్షల విలువైన ఆ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపిస్తే అందజేస్తామని లేకపోతే ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. 

హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌లో దోమలగూడ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో వెంకటరమణ అనే ద్విచక్రవాహనదారుడు నుంచి రూ.1,75,000 స్వాదీనం చేసుకున్నారు. 

చైతన్యపురి: బైక్‌లపై వెళ్తున్న దిల్‌సుఖ్‌నగర్‌ వీవీనగర్‌కు చెందిన బిరాదార్‌ సిద్ధేశ్వర్, సరూర్‌నగర్‌ ఇంద్రహిల్స్‌కు చెందిన బి.శంకర్‌రెడ్డి నుంచి రూ.60 లక్షల నగదును చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చెక్‌పోస్టు వద్ద స్వా«దీనం చేసుకున్నారు. 

చిలుకూరు: సూర్యాపేట జిల్లా చిలుకూరులో బ్యాంక్‌ ఉద్యోగి చీర్యాల సాయికుమార్‌ కారులో రూ. 45 లక్షలు    ఉండటంతో ఆ డబ్బును సీజ్‌ చేశారు.  

అనంతగిరి: సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తమ్మరబండపాలెం వద్ద ధాన్యం వ్యాపారి చింతకుంట్ల కోటేశ్వరరావుకు చెందిన కారులో రూ.7లక్షల 30వేలు లభ్యమయ్యాయి. 

రామగిరి: నల్లగొండ జిల్లా తిప్పర్తి వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన కుంచాల సుధాకర్‌ కారులో పోలీసులు రూ.8 లక్షల 50 వేల నగదును స్వా«దీనం చేసుకున్నారు. 

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో రూ.18,39,500, అంతారం స్టేజీ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.7.40 లక్షలు , కొత్తూరు బైపాస్‌ (వై జంక్షన్‌)వద్ద రూ.8.85 లక్షల నగదు, అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలో రూ. 5.11 లక్షల నగదును పోలీసులుస్వాదీనం చేసుకున్నారు. 

చైతన్యపురి: సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి కొత్తపేట చౌరస్తాలో గోషామహల్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి సునీల్‌ జహంగీర్‌ నుంచి రూ. 7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.  

విజయనగర్‌కాలనీ: గోల్కొండ టోలిచౌకీలోని అప్సర్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ అశ్వాక్‌ ద్విచక్రవాహనంలో రూ.6 లక్షలు ఉన్నట్లు ఆసిఫ్‌నగర్‌ పోలీసులు గుర్తించారు. 

జియాగూడ: కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పురానాపూల్‌ చౌరస్తాలో నార్సింగికు చెందిన ఆనంద్‌ నుంచి సుమారు 30 లక్షల విలువచేసే 600 గ్రాముల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు. 

ఇందల్వాయి: నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి వద్ద కామారెడ్డి నుంచి నిజామాబాద్‌కు కారులో వస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ. 50 లక్షలు స్వా«దీనం చేసుకున్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)