Breaking News

వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం

Published on Thu, 04/17/2025 - 12:15

లక్నో: మాటలు, వినికిడి లోపం ఉన్న 11ఏళ్ల బాలికపై మానవ మృగాలు దాడి చేసి పాశవికంగా ప్రవర్తించాయి. తలుచుకుంటేనే ఒళ్లు జలదరించే రీతిలో బాలికపై ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది కిరాతకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడుతూ చిత్రహింసలు పెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌ (uttar pradesh)రామ్‌పూర్‌ జిల్లాలో జరిగింది. ఆ దారుణం జరిగిన తీరును చూసి వైద్యులే కనీరు పెడుతున్నారు. తాము చూసిన అత్యంత ఘోరమైన  లైంగిక నేరాల్లో ఇది ఒకటి’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రామ్‌పూర్‌ (rampur district) జిల్లాలో ఓ గ్రామానికి చెందిన బాలిక మంగళవారం సాయంత్రం కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, ఆ మరునాడే (బుధవారం)బాధితురాలి ఇంటికి అర కిలోమీటరు దూరంలో ఉన్న చెట్ల పొదల్లో అర్ధనగ్నంగా పడి ఉండడాన్ని ఓ వ్యక్తి గమనించాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు,స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

నేను చూసిన అత్యంత భయంకరమైన లైంగిక నేరాలలో
వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ అంజు సింగ్ బాలికపై జరిగిన దారుణాన్ని చూసి కంట తడిపెట్టారు. ‘నేను చూసిన అత్యంత భయంకరమైన లైంగిక నేరాలలో ఇది ఒకటి. బాలికపై ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు అత్యాచారం చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అంతర్గత అవయవాల్ని సిగరెట్‌తో కాల్చారు. పంటి గాట్లు కూడా ఉన్నాయి.  బలమైన వస్తువుతో ముఖం మీద కొట్టారు. ముఖం మీద తీవ్రగాయాలయ్యాయి. జరిగిన దారుణంతో షాక్‌కి గురైంది. భయపడుతోంది’ అని గద్గద స్వరంతో చెప్పారు.

పోలీసులపై నిందితుడు కాల్పులు
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన అడిషనల్‌ ఎస్పీ అతుల్‌ కుమార్‌ శ్రీవాత్సవ నిందితుడి కోసం గాలింపు చర్యల్ని చేపట్టారు. మూడు పోలీసు బృందాల్ని రంగంలోకి దించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా.. నిందితుడిది అదే గ్రామానికి చెందిన డాన్ సింగ్ (24) అనే వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించారు. పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా కాల్పులకు తెగబడ్డాడు. ఎదురు కాల్పుల్లో డాన్‌ సింగ్‌ గాయపడ్డాడని నిర్ధారించారు. 

బాలికకు మాయ మాటలు చెప్పి
రామ్‌పూర్‌ పోలీస్ చీఫ్ విద్యా సాగర్ మిశ్రా మాట్లాడుతూ ..నిందితుడిని పట్టుకోవడానికి మూడు బృందాలను ఏర్పాటు చేశాం. అతన్ని అరెస్టు  చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపగా.. ఈ కాల్పుల్లో అతనికి బుల్లెట్ గాయమైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాలిక ఇంటి బయట నిందితుడు బాలికతో మాట్లాడాడు. అనంతరం, మాయ మాటలు చెప్పి ఇంటి సమీపంలోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)