Breaking News

తాంత్రికుడు మాటలు నమ్మి.. స్నేహితుణ్ని బలిచ్చారు!

Published on Sun, 01/18/2026 - 21:40

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘాజియాబాద్‌లో దారుణం జరిగింది. డబ్బులు, దైవానుగ్రహం కోసం ఇద్దరు యువకులు తన స్నేహితుణ్ని హత్య చేశారు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. 

పోలీసుల వివరాల మేరకు.. ఘాజియాబాద్‌లోని లోనీ ప్రాంతానికి చెందిన నందు అలియాస్ నవీన్ అనే యువకుడు జనవరి 13వ తేదీ రాత్రి తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో దారుణంగా హత్యకు గురయ్యాడు. నిందితులు పవన్ (25), సాగర్ అలియాస్ పండిట్ (24) తమ స్నేహితుడిని గ్యాస్ సిలిండర్‌తో దాడి చేసి చంపారు. అనంతరం శవాన్ని దాచిపెట్టేందుకు దాన్ని దుప్పట్లో చుట్టి బ్యాటరీతో నడిచే ఆటోలో పెట్టి, ఆ ఆటోను కాల్చివేశారు. ఎలక్ట్రిక్‌ ఆటో కాబట్టి ప్రమాదానికి గురైందని నమ్మించే ప్రయత్నించాడు. 

అయితే, బాధితుడి సోదరుడు ట్రోనికా సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, స్థానిక సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. మరో నిందితుడు నసీమ్ అలియాస్ ఇక్బాల్ పరారీలో ఉండగా.. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

పోలీసుల దర్యాప్తులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. వారు ఒక తాంత్రికుడిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఆ తాంత్రికుడు మానవ బలి ఇస్తే సంపద, దైవానుగ్రహం లభిస్తుందని చెప్పాడు. ఈ మాటలకు ప్రభావితులైన నిందితులు తమ స్నేహితుడినే బలిగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విధంగా నందును హత్య చేసి, శవాన్ని కాల్చివేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులిద్దరికీ గతంలోనే హత్య, దోపిడీ, ఆయుధాల చట్టం ఉల్లంఘన కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)