Breaking News

కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

Published on Tue, 12/24/2024 - 00:52

కురవి: విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా సీరోలు మండలం కాంపల్లి శివారు సక్రాంనాయక్‌ తండా గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. సక్రాంనాయక్‌ తండా డీఎన్‌టీ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న డీఎస్‌ శ్రీను (శ్రీనివాస్‌) నాలుగో తరగతి చదువుతున్న బాలికలకు కొన్ని రోజులనుంచి సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపిస్తున్నాడు. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో విసిగిపోయిన చిన్నారులు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో సోమవారం తల్లిదండ్రులు పాఠశాలలకు చేరుకుని శ్రీనివాస్‌కు దేహశుద్ధి చేశారు. ఎంఈఓ ఇస్లావత్‌ లచి్చరాంనాయక్‌ ఆదేశాల మేరకు కాంపల్లి హైసూ్కల్‌ హెచ్‌ఎం అరుణశ్రీ పాఠశాలకు చేరుకుని విచారణ జరిపారు. అనంతరం డీఈఈ రవీందర్‌రెడ్డికి నివేదిక ఇవ్వడంతో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు. అసభ్యకర ప్రవర్తనపై జిల్లా సంక్షేమ శాఖ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్, బాలరక్షా భవన్‌ వారిని విచారణ చేసేందుకు నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న సీరోలు ఎస్సై నగేశ్‌ పాఠశాల వద్దకు చేరుకుని పిల్లల తల్లిదండ్రులతో, హెచ్‌ఎంతో మాట్లాడారు. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసిరిమాండ్‌కు తరలించినట్టు ఆయన తెలిపారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)