Breaking News

భర్త అంత్యక్రియలకు సాయం చేయండి..

Published on Thu, 09/26/2024 - 04:26

హుజూరాబాద్‌ రూరల్‌: మృత్యువు హఠాత్తుగా భర్తను కబళించింది. అంత్యక్రియలకు పేదరికం ఆటంకంగా నిలిచింది. కన్నీళ్లు దిగమింగుకున్న ఆ ఇల్లాలు సాయం కోసం వేడుకోగా.. స్పందించిన మానవత్వం చివరి మజిలీకి అవసరమైన సాయం చేసింది. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా ధర్మరాజుపల్లిలో చోటుచేసుకుంది. ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన కోట లక్ష్మణ్‌–ప్రేమలత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు. కూలినాలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కూతుళ్లకు ఉన్నంతలో వివాహం జరిపించారు. 

ఇక తమ బతుకు తాము బతుకుదామనుకునే సమయంలో లక్ష్మణ్‌ మంగళవారం ఇంటి వద్ద హఠాత్తుగా కిందపడిపోయాడు. ఆ సమయంలో అందుబాటులో ఎవరూ లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆలస్యమైంది. చివరకు కొందరు గ్రామస్తులు అక్కడకు రావడంతో వెంటనే వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. ఈ క్రమంలోనే చికిత్స అందిస్తుండగానే లక్ష్మణ్‌ మృతి చెందాడు. 

మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకొచ్చేందుకు అద్దె ఇంటి యజమాని అడ్డు చెప్పాడు. దీంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం.. దుఃఖాన్ని దిగమింగుకుంది. ఊరు బయటనే ఓ డేరా వేయించి అక్కడే మృతదేహాన్ని ఉంచారు. అయితే, అంత్యక్రియలు పూర్తిచేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో మృతుడి భార్య కన్నీటిపర్యంతమైంది. మృతదేహాన్ని చూసేందుకు వచి్చన వారిని సాయం చేయాలని ప్రాధేయపడింది. 

తల్లీకూతుళ్లు చేతులు చాచి ఆర్థికసాయం కోసం విన్నవించడం గ్రామస్తులకు కంటతడి పెట్టించింది. స్పందించిన వారు తలాకొంత పోగుచేసి రూ.80 వేలను మృతుడి కుటుంబానికి అందజేశారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌ సూచన మేరకు ఆ పార్టీ నాయకులు కూడా కొంత నగదు అందజేయడంతో అంత్యక్రియలు పూర్తయ్యాయి.  

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు