Breaking News

తగువులు వద్దన్నందుకు తమ్ముడినే చంపేశాడు..

Published on Sat, 10/12/2024 - 03:38

రుద్రవరం:  చిన్న చిన్న విషయాలకు ఇతరులతో గొడవపడొద్దని సూచించిన తమ్ముడిని.. అన్న కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి నంద్యాల జిల్లా రుద్రవరం మండలం బి.నాగిరెడ్డిపల్లెలో జరిగింది. శిరివెళ్ల సీఐ వంశీధర్, ఎస్‌ఐ వరప్రసాద్‌ తెలిపిన వివరాలు.. బి.నాగిరెడ్డిపల్లెలో  గురువారం రాత్రి సురేంద్ర అనే వ్యక్తి మోటార్‌ సైకిల్‌పై వేగంగా వెళ్తుండగా పెద్ద ఓబులేసు అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. 

దాడి విషయం తెలుసుకున్న ఓబులేసు కుటుంబ సభ్యులు.. నువ్వు మద్యం మత్తులో రోజూ ఏదో ఒక సమస్య తెస్తున్నావు.. పద్ధతి మార్చుకోవాలి.. అని చెప్పారు.  ఇందుకు కోపోద్రిక్తుడైన ఓబులేసు.. కత్తితో తమ్ముడు కర్రెన్న అలియాస్‌ ఇసాక్‌(40)ను పొడిచాడు. అడ్డు వచ్చిన తండ్రిపైనా దాడి చేశాడు. 

క్షతగాత్రులిద్దరినీ నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. శుక్రవారం తెల్లవారు జామున ఇసాక్‌ మృతి చెందాడు. మృతుడి భార్య కుమారి  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌చేశారు.  

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)