Breaking News

నవీన్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌.. ఏ2గా హరిహరకృష్ణ ప్రియురాలు

Published on Mon, 03/06/2023 - 18:57

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన నవీన్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నిందితుడు హరిహర కృష్ణ ప్రియురాలు, స్నేహితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్య అనంతరం హరిహరకృష్ణకు ప్రియురాలు డబ్బులు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రియురాలు నిహారికారెడ్డిని ఏ2గా, స్నేహితుడు హసన్‌ను ఏ3గా పోలీసులు చేర్చారు. గత నెల 17న జరిగిన నవీన్ హత్య కేసు వివరాలను ఎల్‌బీ నగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. ‘‘నవీన్‌ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం. నవీన్‌ హత్య గురించి నిహారికకు తెలిసినా పోలీసులకు చెప్పలేదు. హసన్‌కు కూడా హత్య విషయం తెలుసు. నిహారికతో పాటు హసన్‌ను రిమాండ్‌కు తరలించాం’’ అని డీసీపీ వెల్లడించారు.

‘‘హత్య జరిగిన తర్వాత హరిహరకు నిహారిక రూ.1500 ట్రాన్స్‌ఫర్‌ చేసింది. నవీన్‌ను హత్య చేసిన తర్వాత ఘటనాస్థలికి హరిహర, నిహారిక, హసన్‌ ముగ్గురు వెళ్లారు. నిహారిక ఫోన్‌ డేటాను డిలీట్‌ చేసి, ఎవిడెన్స్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడింది. నవీన్‌ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది’’ అని డీసీపీ సాయిశ్రీ పేర్కొన్నారు.
చదవండి: నవీన్‌ను ఎలా చంపావ్‌? హత్య కేసు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)