Breaking News

సెప్టిక్ ట్యాంకులోకి దిగి ఊపిరాడట్లేదని అరుపులు.. కాసేపటికే ముగ్గురూ..

Published on Wed, 04/05/2023 - 15:56

గాంధీనగర్‌: సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి అందులోకి దిగిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడాక ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన గుజరాత్ భరూచ్ జిల్లాలోని దహేజ్‌లో జరిగింది. ఈ ముగ్గురు కార్మికులు స్థానిక పంచాయతీ కార్యాలయంలో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి వెళ్లి చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతులను గల్సిన్‌భాయ్ మునియా(30), పరేశ్ కతారా(31), అనిల్ పర్మార్‌(24)గా గుర్తించారు. వీరంతా దహేజ్ వాసులే కావడం గమనార్హం.

సెప్టిక్‌ట్యాంకులోకి దిగిన వెంటనే తమకు ఊపిరాడటం లేదు సాయం చేయాలని ముగ్గురు కార్మికులు అరుపులు, కేకలు పెట్టినట్లు పోలీసులు వివరించారు. అక్కడున్నవారు వాళ్లను బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ముగ్గురు కార్మికులను బయటకు తీశారని, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే వీరు  చనిపోయారని తెలిపారు.

సెప్టిక్ ట్యాంక్‌లో విషవాయువు పీల్చడం వల్లే కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ముగ్గురూ ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండానే సెప్టిక్ ట్యాంకులోకి దిగినట్లు స్థానికులు వెల్లడించారు.

గుజరాత్‌లో పారిశుద్ధ్య కార్మికులు చనిపోవడం రెండు వారాల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. మార్చి 23న రాజ్‌కోట్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్రంలో గత రెండేళ్లలో మొత్తం 11 మంది పారిశుద్ధ్య కార్మికులు చనిపోవడం ఆందోళన కల్గిస్తోంది.
చదవండి: హైదరాబాద్‌లో కాల్పులు.. ఒకరి మృతి

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)