Breaking News

HYD: జీఎస్టీ అధికారి కిడ్నాప్‌ కలకలం..

Published on Wed, 07/05/2023 - 15:17

సాక్షి, సరూర్‌ నగర్‌: హైదరాబాద్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. సరూర్‌ నగర్‌లో జీఎస్టీ సీనియర్‌ అధికారిపై దాడి పాల్పడి అతడిని కిడ్నాప్‌ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో పోలీసులు కిడ్నాప్‌ను చేధించారు. 

వివరాల ప్రకారం.. సరూర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జీఎస్టీ సీనియర్‌ అధికారి మణిశర్మ కిడ్నాప్‌నకు గురయ్యారు. అయితే, దిల్‌షుక్‌నగర్‌లోని కృష్ణానగర్‌లో జీఎస్టీ కట్టని ఓ షాప్‌ను సీజ్‌ చేసేందుకు ఆఫీసర్‌ మణిశర్మ అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆఫీసర్‌ మణిశర్మ, మరో అధికారి ఆనంద్‌లను షాప్‌ ఓనర్‌, మరో ముగ్గురు కలిసి కిడ్నాప్‌ చేశారు. జీఎస్టీ ఆఫీసర్‌పై వారు దాడికి పాల్పడ్డారు. 

ఇక, కిడ్నాప్‌ సమయంలో నిందితులు వాడిన కారుపై టీడీపీ నేత ముజీబ్‌ పేరుతో స్టికర్‌ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితుల్లో టీడీపీ నేత ముజీబ్‌ అనుచరులు ఉన్నట్టు తెలుస్తోంది. ముజీబ్‌ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత.

ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగి అధికారిని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా కిడ్నాప్‌నకు పాల్పడిన నిందితులను పట్టుకున్నారు. అనంతరం, నలుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)