Breaking News

భయానక వాతావరణం సృష్టించేందుకే..

Published on Mon, 07/08/2024 - 05:22

సాక్షి టాస్‌్కఫోర్స్‌: వైఎస్సార్‌ జిల్లా నల్లచెరువుపల్లె గ్రామ సమీపంలో చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనుల్లో వాటా అడిగారని, ఇస్తానని చెప్పినా చివరికి పనులు మొత్తం ఇవ్వాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చారని కాంట్రాక్టర్‌ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. దీనికి అంగీకరించని తాను 15 రోజులుగా నిలిచిపోయిన పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భయానక వాతావరణం సృష్టించడానికి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే క్యాంపు ఆఫీసుకు దుండగులు నిప్పుపెట్టారని చెప్పారు. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే రోడ్డు పనులను మెగా ఇంజినీరింగ్‌ సంస్థ దక్కించుకుంది. 

ఇందులో నాలుగు కిలోమీటర్ల మేర పనుల్ని సబ్‌ కాంట్రాక్ట్‌ కింద సిద్ధార్థ కంపెనీ యజమాని రామిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి తీసుకున్నారు. ఏప్రిల్‌లో పనులు మొదలుపెట్టారు. పనులు జరుగుతుండగా కూటమి అధికారంలోకి వచ్చి0ది. అప్పటి నుంచి హైవే పనులకు అడ్డంకులు ఎదురయ్యాయి. టీడీపీ నేతలు నల్లచెరువుపల్లె గ్రామ సమీపంలో జరిగే హైవే పనులను అడ్డుకున్నారు. వాటా ఇవ్వందే పనులు చేయకూడదని హుకుం జారీచేశారు. 

అయినా కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించడానికి సిద్ధమైన తరుణంలో వారు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో రాయల్టీ లేకుండా గ్రావెల్‌ తరలిస్తున్నారని అధికారులు టిప్పర్లను సీజ్‌చేశారు. రాయల్టీ అధికారులు విధించిన జరిమానా చెల్లించి టిప్పర్లను తెచ్చుకుని పనులు ప్రారంభించే సమయంలో క్యాంపు ఆఫీసును తగులబెట్టారు. హైవే రోడ్డు పనులు నాలుగు కిలోమీటర్లు సబ్‌ కాంట్రాక్ట్‌ తీసుకున్నానని, దాన్లో రెండు కిలోమీటర్లు చేసుకునేందుకు ఇచ్చేస్తానని టీడీపీ నేతలకు చెప్పినట్లు కాంట్రాక్టర్‌ తెలిపారు. 

కానీ వారు మొత్తం నాలుగు కిలోమీటర్ల పనులు కావాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఇందుకు అంగీకరించని తాను పనులు ప్రారంభించడానికి సిద్ధమయ్యానని, ఈ పనులను ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో కొంతమంది దుండగులు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే క్యాంపు ఆఫీసును తగులబెట్టారని చెప్పారు. ఈ సంఘటనలో సుమారు రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)