Breaking News

మనవడి చితిలోనే తాత మరణ శాసనం..

Published on Sat, 03/08/2025 - 21:32

భోపాల్:  ఇదొక కల్లోలం.. ముగ్గురి జీవితాలపై విధి ఆడిన వింత నాటకం. సాఫీగా సాగుతున్న జీవితంలో ఒక్క ఉదుటను దూకిన ‘మృత్యుఘోష’. ఈ ఘటనలో ఒకరు హత్యకు గురైతే, మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకొకరు ఆత్మాహుతి చేసుకున్నారు.  మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ విషాద ఘటన తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురౌవుతుంది.

రాష్ట్రంలోని బాహ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో సిహోలియా గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ముందుగా భార్యను చంపిన భర్త ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. మెడకు ఉరితాడు బిగించుకుని తాను కూడా ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత మనవడి మరణాన్ని జీర్ణించుకోలేని తాత.. అదే చితిమంటల్లో దూకి ఆత్మార్పణం చేసుకున్నాడు.

అభయ్ రాజ్ అనే 34 ఏళ్ల వ్యక్తి..  భార్య సవితా యాదవ్(31)ను హత్య చేశాడు. ఇక తనులేని జీవితం వద్దనుకున్నాడో, లేక జైలు పాలు కావాల్సి వస్తుందని భయపడ్డాడో కానీ ఉరి వేసుకుని అతను కూడా తనువు చాలించాడు.  ఇది శుక్రవారం ఉదయం జరగ్గా, అదే రోజు సాయంత్ర వారి అంత్యక్రియలు నిర్వహించారు. 

అయితే మనవడిఅభయ్ రాజ్) లేని జీవితం వద్దనుకున్న తాత రామావతార్‌.. తాను కూడా ఆ మనవడి అంత్యక్రియలు నిర్వహించిన చితి మంటల్లోనే దూకి ప్రాణం తీసుకున్నాడు. అయితే శనివారం ఉదయమే ఈ వార్త తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కాలిన మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఒక హత్య, రెండు ఆత్మహత్యల వెనుక కారణాలు ఏమిటో తెలియలేదని సిధి జిల్లా డీఎస్పీ గాయత్రి తివారీ తెలిపారు. దీనిపై దర్యాప్తు సాగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)