Breaking News

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

Published on Wed, 11/13/2024 - 03:59

సాక్షి, పెద్దపల్లి/రామగుండం: పెద్దపల్లి జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు మంగళవారం పట్టాలు తప్పటంతో ఢిల్లీ–చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్‌ నుంచి ఘజియాబాద్‌ వైపు 43 వ్యాగన్లతో ఐరన్‌ కాయల్స్‌ లోడుతో వెళుతున్న గూడ్స్‌ రైలులోని 11 వ్యాగన్లు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్‌–కన్నాల గేట్‌ మధ్యలో 282/35 పోల్‌ వద్ద పట్టాలు తప్పాయి. 

దీంతో ఈ మార్గంలో ఎటువైపు రైలు అటువైపు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పునరుద్ధరణ పనులు చేపట్టారు. మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, ఓదెల, జమ్మికుంట తదితర రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

మూడు లైన్లు ధ్వంసం 
కన్నాల గేట్‌ వద్ద 11 వ్యాగన్లు పట్టాలపై పడిపోవడంతో కాజీపేట్‌–బల్లార్షా మధ్య ఉన్న మూడు రైల్వే లైన్స్‌ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద తీవ్రతకు పట్టాలు విరిగిపోయి చెల్లాచెదురయ్యాయి. కరెంట్‌ పోల్స్‌ సైతం విరిగిపోయాయి. వ్యాగన్లు ఒక్కదానిపైకి ఒక్కటి ఎక్కడంతో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు కష్టంగా మారాయి. 

రైలు ఇంజిన్, గార్డ్‌ వ్యాగన్‌ పట్టాలు తప్పలేదు. పునరుద్ధరణ పనులు రాత్రి 11 గంటల తరువాత మొదలయ్యాయి. రైలు ఇంజిన్‌వైపు ఉన్న 8 వ్యాగన్లతోసహా గూడ్స్‌ను రామగుండంకు తరలించారు. భాగ్యనగర్‌ రైలు రాఘవాపూర్‌కు చేరుకోగా, దానిని వెనుకకు మళ్లించి పెద్దపల్లిలో ప్రయాణికులను దింపివేశారు. 

వరంగల్‌ వైపు వెళ్లే మరికొన్ని సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రామగుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్లలో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు కనీసం 24 గంటల సమయం పట్టవచ్చని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి లోకోపైలెట్లు ఇద్దరు, గార్డు సురక్షితంగా బయటపడ్డారు.   

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)