Breaking News

నీతూబాయి ఆట కట్టిస్తాం..

Published on Tue, 12/24/2024 - 10:46

సాక్షి, హైదరాబాద్: గంజాయి డాన్‌గా పేరొందిన నీతూబాయిని ఎట్టిపరిస్థితుల్లోనూ  పట్టుకుని తీరుతామని  ఎక్సైజ్‌శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు.ఆమె పట్ల తాము ఎలాంటి మెతక వైఖరి అవలంభించడం లేదని, కఠినంగా  వ్యవహరిస్తున్నామన్నారు. నానక్‌రామ్‌గూడ కేంద్రంగా  నగరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న  నీతూబాయి  ఎక్సైజ్‌ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఎక్సైజ్‌ శాఖతో  పాటు లా ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు కూడా సీరియస్‌గా దృష్టి సారించాయన్నారు. 

ఆమె అక్రమ కార్యకలాపాలపై  కేసులు నమోదు చేశామని, గతంలో ఆమె పలు కేసుల్లో  జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అయినా ఆమె వైఖరిలో మార్పురాలేదన్నారు. బయటికి వచ్చిన తర్వాత కూడా యధావిధిగా గంజాయి అమ్మకాలు కొనసాగిస్తుండడంతో  బెయిల్‌కు అవకాశం లేకుండా పోలీస్‌ శాఖ ఆమెపై పీడీ యాక్ట్‌ నమోదు చేసిందన్నారు. రెండు సార్లు పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకు పంపడమే కాకుండా, గంజాయి అమ్మకాల ద్వారా నీతూబాయి, ఆమె కుటుంబసభ్యులు  అక్రమంగా కూడబెట్టిన స్థిర, చర ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. 

నీతూబాయ్‌ నుంచి రూ.15.17 లక్షలు, ఆమె కుటుంబ సభ్యులైన  మధుబాయి రూ. 25.13 లక్షలు, గౌతమ్‌సింగ్‌ నుంచి రూ.91.21 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ. 86 లక్షల స్థిరాస్తులను జప్తు చేశామన్నారు. నీతూబాయిపై హిస్టరీ షీట్‌ను  ఓపెన్‌ చేసినట్లు చెప్పారు. శేరిలింగంపల్లి, గోల్కొండ, గచి్చబౌలి, మొయినాబాద్, గౌరారం, నల్లగొండ టూటౌన్‌లతోపాటు ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లు ధూల్‌పేట్, నారాయణగూడలోనూ ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆమెపై 25 కేసులు ఉన్నాయని, పోలీసులు 7 కేసులు నమోదు చేశారన్నారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. ఆపరేషన్‌ ధూల్‌పేట్‌ తరహాలో నానక్‌రాంగూడలోనూ గంజాయి నిర్మూలనకు  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు  ఆయన వివరించారు.

ప్రేమంటూ వేధింపులు.. యువతి బలవన్మరణం

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)