Breaking News

గచ్చిబౌలి డ్రగ్స్‌ కేసులో నిందితుల డ్రామాలు!

Published on Tue, 03/05/2024 - 17:19

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో నిందితులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు పోలీస్‌ వర్గాలు భావిస్తున్నాయి.  అధునాతన డ్రగ్స్‌ టెస్టులకు సైతం చిక్కకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని చూసి అధికారులు నివ్వెరపోతున్నట్లు తెలుస్తోంది.

హెయిర్‌ శాంపిల్స్‌ టెస్టు.. యూరిన్‌ టెస్ట్‌.. రెండింటిలోనూ నెగెటివ్‌ ఫలితం గచ్చిబౌలి పోలీసులను కంగుతినేలా చేస్తోంది. ఈ క్రమంలో ఇక చివరగా నిందితుల బ్లడ్‌ శాంపిల్స్‌ నివేదికలపైనే పోలీసులు ఆధారపడుతున్నారు. అయితే..

అలా ఎలా?.. 
గచ్చిబౌలి డ్రగ్స్‌ కేసులో.. నీల్‌ అనే నిందితుడు మినహా మిగతా 12 మంది విచారణకు హాజరయ్యారు. అయితే వాళ్లకు నిర్వహిస్తున్న టెస్టుల్లో నెగెటివ్‌ రావడంతో దర్యాప్తు అధికారులు కంగుతింటున్నారు. వాస్తవానికి.. డ్రగ్స్‌ పార్టీ జరిగిన మరుసటి రోజే ముగ్గురు నిందితుల శాంపిల్స్‌లో పాజిటివ్‌గా తేలింది. అయితే వారం రోజుల గడువుతో మళ్లీ విచారణకు వచ్చారు నిందితులు. ఈలోపు పూర్తి డైట్‌ పాటించడంతోనే ఇప్పుడు ఫలితం నెగెటివ్‌గా వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు హెయిర్‌శాంపిల్స్‌లోనూ నెగెటివ్‌ ఫలితంపై అధికారులు విశ్లేషణ జరుపుతున్నారు. హెయిర్‌ శాంపిల్స్‌ టెస్టుల్లో బయటపడకుండా ఉండేందుకు డై వేసుకుని వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

చివరగా.. వాళ్ల నుంచి బ్లడ్‌ శాంపిల్స్‌ను పోలీసులు సేకరించారు. త్వరలోనే వాటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అయితే అందులో పాజిటివ్‌ వచ్చినా కన్జూమర్స్‌ పేరుతో వాళ్లు బయటపడేందుకు యత్నాలు చేసే అవకాశం లేకపోలేదని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)