Breaking News

తల్లి చెంతకు చేరేలోపే.. గుండెపోటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి

Published on Tue, 11/19/2024 - 10:26

భారత్‌లో గుండె పోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. డ్యాన్స్ వేస్తూ, వ్యాయామం చేస్తూ, అలా కూర్చుని చనిపోయిన ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఈ మాయదారి గుండెపోటు బలితీసుకుంటుంది. తాజాగా అభం శుభం తెలియని ఓ చిన్నారి సైతం గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. 

సాక్షి, ఖమ్మం: అప్పటివరకు తల్లిదండ్రులతో ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారి గుండెపోటుతో మృతిచెందింది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెంకు చెందిన కుర్రా వినోద్, లావణ్య దంపతులకు నాలుగేళ్ల కుమార్తె  ప్రహర్షిక ఉంది. 

సోమవారం తల్లి లావణ్య గ్రూప్‌-3 పరీక్ష రాసేందుకు వెళ్లగా.. చిన్నారి నానమ్మ, తాతయ్యల వద్ద ఆడుకుంటూ ఉంది. సాయంత్రం ఇంటి తిరిగి వస్తున్న తల్లిని చూసి ప్రహర్షిక ఒక్కసారిగా ఆమె వైపు పరుగెత్తుకు వెళ్లింది.  తల్లి కూడా రా..రా.. అంటూ కూతుర్ని చూస్తూ చేతులు చాచింది. కానీ అమ్మను చేరక ముందే ఆ పాప ఒక్కసారిగా  కిందపడిపోయింది. తల్లి ఏమైందని ప్రశ్నించగా ఛాతీ వద్ద నొప్పి వస్తోందని చెప్పి అపస్మారక స్థితికి చేరుకుంది. 

వెంటనే కుటుంబసభ్యులు చిన్నారికి స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి.. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ల ముందే మృతి చెందడంలో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు .చిన్నారి గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని వైద్యులు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)