Breaking News

నీటమునిగి నలుగురి మృత్యువాత

Published on Tue, 09/26/2023 - 00:41

మనోహరాబాద్‌(తూప్రాన్‌): దుస్తులు ఉతికేందుకు చెరువుకు వెళ్లగా..అదే వారి పాలిట మృత్యుకుహరమైంది. బోనాల పండుగకు వచ్చిన తోటికోడళ్లు, కుటుంబసభ్యులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు. మూడు కుటుంబాల్లో పెను విషాదం నింపిన ఈ ఘటన మెదక్‌ జిల్లాలో చోటు చేసుకుంది. మనోహరాబాద్‌ మండలం రంగాయపల్లిలో ఆదివారం బోనాలు జరిగాయి. గ్రామానికి చెందిన ఫిరంగిలక్ష్మి ఇంట్లో జరిగిన ఈ వేడుకలకు ఆమె అన్నదమ్ములు సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం అంబర్‌పేట్‌కు చెందిన దుడ్డు యాదగిరి, శ్రీకాంత్‌లు భార్యాపిల్లలతో హాజరయ్యారు.

సోమవారం మధ్యాహ్నం దుస్తులు ఉతికేందుకు ఫిరంగిలక్ష్మి తన పెద్దకూతురు లావణ్య (23), సోదరుల భార్యలు దుడ్డు బాలమణి (30), దుడ్డులక్ష్మి(25), బాలమణి కుమారుడు చరణ్‌(10)తో కలిసి ఊర చెరువు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో చెరువులో ఆడుకుంటున్న చరణ్‌ ఒక్కసారిగా నీటి మునిగిపోయాడు. గమనించిన లావణ్య, బాలమణి, లక్ష్మిలు కాపాడేందుకు లోతుగా ఉన్న నీటిలోకి వెళ్లి వారు కూడా మునిగిపోయారు. గట్టుపై ఉన్న ఫిరంగి లక్ష్మి కేకలు వేస్తూ వారిని కాపాడేందుకు నీటిలోకి దిగింది. పట్టుతప్పి ఆమె కూడా నీటిలో మునిగింది.

అటుగా వెళుతున్న ఓ యువకుడు గమనించి ఆమెను జుట్టు పట్టి బయటకు లాగడంతో ప్రాణాలతో బయటపడింది. బాలుడితోసహా నీటిలో మునిగిన లావణ్య, బాలమణి, లక్ష్మిని బయటకు తీయగా, అప్పటికే వారు విగతజీవులుగా మారారు. చరణ్‌ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన తూప్రాన్‌ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, సర్పంచ్‌ నాగభూషణం, తూప్రాన్‌ పీఎసీఎస్‌ చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)