Breaking News

హృదయవిదారకం: కరెంట్‌ షాక్‌తో గున్న ఏనుగు.. కాపాడదామని మరో మూడు

Published on Sat, 05/13/2023 - 05:01

సాక్షి ప్రతినిధి, విజయనగరం: తాగునీటి కోసం పొలాల్లోకి వచ్చిన నాలుగు ఏనుగులు విద్యుదాఘాతం­తో మృత్యువాత పడ్డాయి. పార్వతీపురం మ­న్యం జిల్లా భామిని మండలం పక్కుడుభద్ర గ్రామ సమీపంలో గురువారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఒక గున్న ఏనుగు, ఐదు పెద్ద ఏనుగుల గుంపు గత ఫిబ్రవరిలో ఒడిశా సరిహద్దులోని అడవుల్లోంచి భామిని మండలంలోకి వచ్చింది. మూడు నెలలుగా ఇక్కడి అడవుల్లో ఉంటూ ఆహారం, తాగునీటి కోసం సమీప పొలాల్లోకి వస్తుండేవి. ఎవరికీ హాని చేయకపోవడంతో వాటిని చూసేందుకు పార్వతీపురం మన్యం జిల్లావాసులే కాకుండా ఒడిశా నుంచి కూడా వస్తుండేవారు.

ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి పక్కుడుభద్ర గ్రామ సమీపంలోని పొలాల్లోకి వచ్చాయి. బొమ్మిక మిన్నారావుకు చెందిన బోరుబావి వద్దకు వెళ్లేందుకు యత్నించాయి. ఆ పక్కనే ఉన్న త్రీఫేజ్‌ విద్యుత్‌ లైన్, ట్రాన్స్‌ఫార్మర్‌ను గున్న ఏనుగు తన తొండంతో లాగింది. దీంతో విద్యుత్‌ షాక్‌కు గురై విలవిలలాడుతున్న గున్న ఏనుగును రక్షించేందుకు మరో మూడు పెద్ద ఏనుగులు ప్రయత్నించాయి. దీంతో నాలుగూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. వాటిని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు వేలాది సంఖ్యలో పోటెత్తారు.

నాలుగు ఏనుగుల కళేబరాలకు విశాఖ జూ వైద్యాధికారి శ్రీనివాసరావు బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఘటన స్థలంలోనే వాటిని ఖననం చేసేందుకు రైతు మిన్నారావు అంగీకరించడంతో  జేసీబీలతో పెద్ద గోతులు తీయించి కళేబరాలను ప్రొటోకాల్‌ ప్రకారం ఖననం చేశారు. విశాఖ రేంజ్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ శ్రీకంఠనాథరెడ్డి, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల డీఎఫ్‌వోలు పాల్గొన్నారు.  

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)