Breaking News

మాజీ ఎంపీ సురేష్ కు 14రోజుల రిమాండ్‌

Published on Fri, 09/06/2024 - 05:06

సాక్షి, అమరావతి/మంగళగిరి : బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను బుధవారం అర్థరాత్రి దాటాక హైదరాబాద్‌లో అరెస్టుచేసిన పోలీసులు ఆయనను గురువారం ఉ.8.30 గంటలకు మంగళగిరి రూరల్‌ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టుచేసిన పోలీసులు స్టేషన్‌లో ఎనిమిది గంటలపాటు విచారించారు. ఈయనతోపాటు విజయవాడ డిప్యూటీ మేయర్‌ శైలజ భర్త శ్రీనివాసులరెడ్డిని కూడా అరెస్టుచేసిన మంగళగిరి రూరల్‌ పోలీసులు వీరిద్దరినీ మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. 

న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించారు. అనంతరం వీరిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ.. అక్రమ కేసులతో తమను అడ్డుకోలేరని, 2029లో చంద్రబాబుకు బుద్ధిచెప్పి తీరుతామన్నారు. కక్షతోనే తమపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందిపెడుతున్నారని.. ప్రజలు, దేవుడు చూస్తున్నారని చెబుతూ జై జగన్‌ అంటూ నినదించారు. అంతకుముందు.. స్టేషన్‌ వద్ద సురేష్‌ సతీమణి బేబీలత మాట్లాడుతూ.. తన భర్తపై చంద్రబాబు అక్రమంగా కేసులు పెట్టారన్నారు. 

కేసులతో తమను భయపెట్టలేరని, 2019కు ముందు పొలాల దగ్థం కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని అప్పట్లో తన భర్తపై టీడీపీ నేతలు ఎంత ఒత్తిడి చేసినా లొంగలేదని.. ఇలాంటి అక్రమ కేసులకు తాము భయపడేదిలేదని స్పష్టంచేశారు. ఇక సురే‹Ùను అరెస్టుచేశారని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, టీజేఆర్‌ సుధాకర్‌బాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, నవరత్నాల అమలు కమిటీ మాజీ  చైర్మన్‌ నారాయణమూర్తి, గుంటూరు కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ బాలవజ్ర బాబు, మాదిగ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కమ్మూరి కనకారావు తదితరులతో పాటు కార్యకర్తలు స్టేషన్‌ వద్దకు చేరుకుని ఆయనకు మద్దతు పలికారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)