ఎంఎస్‌ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమలో ఘోర ప్రమాదం

Published on Thu, 01/02/2025 - 05:36

పెళ్లకూరు: తిరుపతి జిల్లాలోని ఓ స్టీల్‌ పరిశ్రమలో బుధవారం రాత్రి భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. పలువురు గాయపడినట్లు చెబుతున్నారు.  జిల్లాలోని పెళ్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామంలో ఉన్న ఎంఎస్‌ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమలో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ భారీ శబ్దంతో పేలిపోయి, మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కూడా భారీ పేలుళ్లు సంభవించాయి. భారీ పేలుళ్లతో పెన్నేపల్లి గ్రామం దద్దరిల్లింది. 

పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు పెద్దపెట్టున కేకలు పెడుతూ బయటకు పరుగులు తీశారు. ఫర్నేస్‌ సమీపంలో పనిచేస్తున్న వారిలో ఐదుగురు చనిపోయి ఉంటారని కార్మికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికులను స్థానికులు, పోలీసులు నాయుడు­పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

పరిశ్రమ మేనేజర్‌ సుబ్రహ్మ­ణ్యం రెడ్డి ఫ్యాక్టరీ వద్దకు వచ్చిన తర్వాతే ఎంతమంది పనిచేస్తున్నా­రు, ఎంతమంది బయటపడ్డారు అనే వివరాలు తెలుస్తాయని చెబు­తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిశ్రమ వద్దకు చేరుకున్నప్పటికీ, ప్రమాదం జరిగిన యూనిట్‌లోకి ప్రవేశించడానికి సాహసించడం లేదు. పరిశ్రమలో ఉన్న మరో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ కూడా పేలితే భారీ ప్రమాదం ఉంటుందన్న భయంతో ఎవరూ లోపలికి ప్రవేశించడంలేదు. 

కార్మికులు అంతా ఇతర రాష్ట్రాల వారే. వారు తెలుగు మాట్లాడలేకపోవడంతో ఏం చెబుతున్నారో పోలీసులకు అర్థం కావడంలేదు. పంచాయతీ అనుమతులు లేకుండా ఈ కంపెనీలో రెండో యూనిట్‌ ఏర్పాటు చేశారంటూ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)