Breaking News

వితంతువుతో వివాహేతర సంబంధం.. ఉల్లాసంగా గడిపారు.. చివరికి షాకింగ్‌ ట్విస్ట్‌

Published on Fri, 04/21/2023 - 10:37

వేలూరు(తమిళనాడు): వివాహేతర సంబంధం కొనసాగించేందుకు నిరాకరించిందని వితంతు మహిళను హత్య చేసిన ఘటన వేలూరు జిల్లాలో జరిగింది. అనకట్టు తాలుకా వాయపందల్‌ గ్రామానికి చెందిన మలర్‌(28) భర్త వినోద్‌కుమార్‌ కొద్ది నెలల క్రితం మృతిచెందాడు. ఐదేళ్ల కుమారుడితో కలిసి అదే ప్రాంతంలో ఉంటోంది. ఈ నెల 17వ తేదీ వితంతు పింఛన్‌ కోసం వెళ్లిన మలర్‌ తిరిగి ఇంటికి రాలేదు.

బుధవారం సాయంత్రం అటవీ ప్రాంతంలో మృతదేహంగా కనిపించింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనకట్టు పోలీసులు విచారణ చేపట్టారు. హత్య కేసులో అదే గ్రామానికి చెందిన షణ్ముగం(30)ను అరెస్ట్‌ చేసి విచారణ జరిపారు. అందులో షణ్ముగంకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మలర్‌ భర్త మృతి చెందడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఉల్లాస జీవితాన్ని అనుభవించారు.

ఈ విషయం గ్రామంలో తెలియడంతో గ్రామ పెద్దలు ఇద్దరిని హెచ్చరించి పంపారు. అయినా షణ్ముగం మలర్‌ను వదలకుండా వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈనెల 17వ తేదీ దారిలో వస్తున్న మలర్‌ను రమ్మని పిలవడంతో ఆమె నిరాకరించారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. షణ్ముగం పక్కనే ఉన్న రాతిని మలర్‌ తలపై వేసి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేసి వేలూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు.
చదవండి: వివాహేతర సంబంధం.. ఆ టైంలో గడిపిన వీడియోను ఆమె భర్తకు పంపి..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)