Breaking News

గ్యాంగ్‌స్టర్‌ గడోలీ ప్రియురాలు దివ్యా పహుజా హత్య

Published on Thu, 01/04/2024 - 02:39

గురుగ్రామ్‌: ఎనిమిదేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్‌ సందీప్‌ గడోలీ ప్రియురాలు, మాజీ మోడల్‌ దివ్యా పహుజాను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో ఓ హోటల్‌ గదిలో ఈ దారుణం జరిగిందని పోలీసులు బుధవారం వెల్లడించారు. ఐదుగురు వ్యక్తులు మంగళవారం రాత్రి ఆమెను హోటల్‌ గదికి తీసుకొచ్చినట్లు తెలిసింది.

తుపాకీతో ఆమె తలపై కాల్చి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని కారులో బయటకు తరలిస్తుండగా, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గడోలీ హత్య కేసులో నిందితురాలైన దివ్యా పహుజాకు గత ఏడాది జూన్‌లో బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఉత్తరాదిన పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ సందీప్‌ గడోలీ 2016 ఫిబ్రవరి 7న ముంబైలో హత్యకు గురయ్యాడు.

నకిలీ ఎన్‌కౌంటర్‌లో హరియాణా పోలీసులే అతడిని హతమార్చినట్లు దర్యాప్తులో తేలింది. గడోలీ ప్రత్యర్థి అయిన మరో గ్యాంగ్‌స్టర్‌ వీరేంద్ర కుమార్‌ అలియాస్‌ బిందర్‌ గుజ్జర్‌ హరియాణా పోలీసులతో చేతులు కలిపి ఈ ఎన్‌కౌంటర్‌ చేయించినట్లు వెల్లడయ్యింది. గడోలీని ముంబైకి రప్పించడానికి హరియాణా పోలీసులు అతడి ప్రియురాలు దివ్యా పహుజాను పావుగా వాడుకున్నారు. ఆమె ద్వారా అతడిని హనీట్రాప్‌ చేశారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)