Breaking News

భర్తే కాదు.. బావతోనూ సంసారం చేయాలని చిన్న కోడలిపై దారుణం

Published on Fri, 10/31/2025 - 16:15

సాక్షి,ఏలూరు: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తతో పాటు బావతోనూ సంసారం చేయాలంటూ అత్తా,మామలు చిన్న కోడలిని చిత్ర హింసలకు గురి చేయడం కలకలం రేపింది. అందుకు తన తల్లిదండ్రులకు బాధితురాలి భర్త రంజింత్‌ కుమార్‌ వంతపాడటం గమనార్హం. 

జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. భర్తతో పాటు బావతోనూ సంసారం చేయాలంటూ చిన్న కోడలిపై అత్తమామలు ఒత్తిడి తెచ్చారు. బావకి పిల్లలు లేనందున అతనితో సంసారం చేసి పిల్లలు కనాలని కోరికను వ్యక్తం చేశారు. అందుకు బాధితురాలు నిరాకరించడంతో ఆమెను గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. తల్లిదండ్రులు డిమాండ్‌కు భర్త మౌనంగా ఉండిపోవడంతో బాధితురాలికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.  

ఏడాది క్రితం బాధితురాలు బాబుకు జన్మనిచ్చినప్పటికీ, తాము చెప్పినట్లు చేయలేదన్న కారణంతో గత పది రోజులుగా ఆమెను, ఆమె కుమారుణ్ని గదిలో బంధించారు. గదికి కరెంటు, మంచినీళ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకుండా చేశారు. ఈ అమానుష చర్యలు ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.

ఈ విషయంపై మానవ హక్కుల సంఘం నేతలకు సమాచారం అందడంతో, వారు పోలీసుల సహాయంతో శుక్రవారం బాధితురాలు నివసిస్తున్న ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. బాధితురాలిని బంధించిన గదికి తాళాలు పగలగొట్టి ఆమెను బయటకు తీసుకువచ్చారు. అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

Ellur: భర్తతోనే కాదు.. బావ, మామతో కూడా..

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)