Breaking News

Jubilee Hills: మద్యం మత్తులో కారు నడిపి..

Published on Mon, 12/30/2024 - 07:44

బంజారాహిల్స్‌: ఓ యువకుడు మద్యం మత్తులో కారు నడిపి మితిమీరిన వేగంతో చెట్టుకు, డివైడర్‌కు ఢీకొట్టిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. వెస్ట్‌ మారేడ్‌పల్లి సుమన్‌ హౌసింగ్‌ కాలనీలో నివసించే తీగుళ్ల దయాసాయిరాజ్‌ (27) రైల్వే ఆఫీసర్స్‌ కాలనీలో నివసించే తన స్నేహితురాలు (27)తో కలిసి శనివారం రాత్రి ఫిలింనగర్‌ సమీపంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఓ విందుకు హాజరయ్యాడు. ఇద్దరూ ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు ఆ విందులో పాల్గొని మద్యం తాగారు. దయాసాయిరాజ్‌ మోతాదుకు మించి మద్యం తాగి ఇంటికి వెళ్లే క్రమంలో తన స్నేహితురాలిని తీసుకుని అర్ధరాత్రి 2.30 గంటలకు ఫంక్షన్‌ హాల్‌ నుంచి బెంజ్‌ కారు బయలుదేరాడు.

 సినీ నటుడు బాలకృష్ణ ఇంటి వద్దకు రాగానే కారు అదుపు తప్పి డివైడర్‌ను, ఆ తర్వాత చెట్టును ఢీకొని రోడ్డుకు అవతల వైపు బోల్తాపడింది. ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోవడంతో కారులోని ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. చెట్టు విరిగిపడి డివైడర్‌ ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వీరిద్దరినీ స్టేషన్‌కు తరలించారు. ఆదివారం ఉదయం 3 గంటలకు స్టేషన్‌కు తీసుకువచి్చన వీరిద్దరినీ డ్రంకన్‌ డ్రైవ్‌ టెస్ట్‌కు యతి్నంచగా వీరు సహకరించలేదు. 

3 గంటల పాటు పోలీసులను దూషిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఠాణాలో న్యూసెన్స్‌ చేశారు. మద్యం మత్తులో స్టేషన్‌లో ఇద్దరూ వీరంగం సృష్టించారు. ఎట్టకేలకు వీరికి శ్వాస పరీక్షలు నిర్వహించగా దయాసాయిరాజ్‌కు 94 ఎంజీ, యువతికి 73 ఎంజీ రక్తంలో ఆల్కహాలిక్‌ నమోదైంది. వీరిద్దరిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కింద సెక్షన్‌ విధించి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)