Breaking News

గుంతకల్లులో డ్రగ్స్‌ కలకలం

Published on Wed, 08/30/2023 - 03:34

గుంతకల్లు టౌన్‌: గోవా నుంచి హైదరాబాద్‌కు మాదక ద్రవ్యాల ప్యాకెట్లను సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను అనంతపురం జిల్లా గుంతకల్లు వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారినుంచి రూ.65 వేల విలువజేసే 12.890 గ్రాముల ‘మేథాంపేటామైన్‌’ అనే నిషేధిత డ్రగ్‌తో పాటు రెండు సెల్‌ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. మంగళవారం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో సీఐ రామసుబ్బయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరానికి చెందిన ఎరెల్లి దయాకర్, మలికపురం మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన రాసిబట్టుల వివేక్‌  హైదరాబాద్‌కు వెళ్లి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు.

ఈ క్రమంలోనే వీరిరువురు డ్రగ్స్‌కు బానిసలయ్యారు. హైదరాబాద్‌లో వీరికి పరిచయమైన స్నేహితులకు డ్రగ్స్‌ గురించి తెలియజేయగా, తమకు కూడా తెచ్చివ్వాలని వారు కోరడంతో గోవాకు వెళ్లి డ్రగ్స్‌ కొనుగోలు చేసి సోమ­వారం సాయంత్రం గుంతకల్లుకు చేరుకున్నారు. అయితే రాత్రి వరకు హైదరాబాద్‌కు రైలు లేకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా ఏదైనా వాహనంలో వెళ్లేందుకు ఇద్దరు యువకులూ స్థానిక బీరప్పగుడి సర్కిల్‌లో వేచి ఉన్నారు.

అందిన సమాచారం మేరకు పోలీసులు ఇద్దరు యువకుల్నీ అదుపులోకి తీసుకు­ని విచారించగా అసలు గుట్టు రట్టయ్యింది. స్వా«దీనం చేసుకున్న డ్రగ్‌ ఒక్కో గ్రాము రూ.5 వేల ధర పలుకుతుందని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)