Breaking News

డ్రగ్ మాఫియా: వినూత్న మార్గాల్లో గంజాయి రవాణా..

Published on Mon, 01/01/2024 - 20:52

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డ్రగ్ మాఫియా వినూత్న మార్గాల్లో గంజాయి రవాణాకు పాల్పడుతోంది. బీరువాల తరలింపు మాటున గంజాయి తరలిస్తున్న ముఠాను భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి పోలీసులు అడ్డుకున్నారు. ఏపిలోని చింతూరు నుంచి కర్ణాటకలోని బీదర్‌కు తరలిస్తుండగా గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్‌ మాఫియాపై జిల్లా ఎస్పీ డా.వినీత్, ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు. 

డ్రగ్‌ మాఫియా ముఠా.. ప్రత్యేకంగా రూపొందించిన బీరువాల్లో గంజాయి పేర్చి ఇతర రాష్ట్రాలకు తరలిస్తోందని తెలిపారు. రూ. 30లక్షల విలువ చేసే 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒక వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారని అ‍న్నారు. ఈ మఠాలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉ‍న్నట్లు చెప్పారు. ఈ కేసుపై అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణంలో గంజాయిని అమ్ముతున్న ఏడుగురు యువకుల ముఠాను  పోలీసులు పట్టుకున్నారు. యువకుల నుంచి 7 గంజాయి ప్యాకెట్లు, మూడు ఆటోలు,సెల్‌ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకుట్లు పోలీసులు తెలిపారు. యువకులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు సదాశివపేట పోలీసులు పేర్కొన్నారు.

నిజామాబాద్‌లో తొలిసారి కొకైన్ లభ్యం.. 
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో తొలిసారి కొకైన్ ఇతర మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి. డిచ్‌పల్లి మండలం నడిపల్లి వద్ద ఢిల్లీ నుంచి వచ్చిన స్కోడా కారులో కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఇద్దరు యువకులు ఢిల్లీ వ్యక్తి రాహుల్ ద్వారా తెచ్చుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఒక కారు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

చదవండి: బిర్యానీ గొడవ: కస్టమర్లపై దాడి.. ఎమ్మెల్యే రాజాసింగ్‌ సీరియస్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)