Breaking News

అప్పు అడిగితే డ్రగ్‌ పెడ్లర్‌గా మార్చాడు!

Published on Tue, 12/17/2024 - 07:55

సాక్షి, సిటీబ్యూరో: తనను అప్పు అడిగిన చిన్ననాటి స్నేహితుడిని డ్రగ్‌ పెడ్లర్‌గా మార్చాడో వ్యక్తి. ముంబైలో ఉండే సప్లయర్స్‌ను కూడా పరిచయం చేశాడు. న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో మాదకద్రవ్యం అమ్మి దండిగా సంపాదించ వచ్చని ప్రేరేపించాడు. ఈ దందాపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఓ నిందితుడిని పట్టుకుని 13.9 గ్రాములు ఎండీఎంఏ డ్రగ్‌ స్వాదీనం చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. సోమవారం అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు  కేసు వివరాలు వెల్లడించారు. 

కడప జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన షేక్‌ మహ్మద్‌ హనీఫ్‌ పదో తరగతి వరకు చదివాడు. ఆపై క్యాబ్‌ డ్రైవర్‌గా మారి 2016లో బతుకుతెరువు కోసం కువైట్‌ వెళ్లాడు. మూడేళ్ల తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చిన అతను తన స్వస్థలంలోనే ఉంటున్నాడు. నెలకు రూ.16 వేల జీతానికి క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్న హనీఫ్‌కు కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ నేపథ్యంలో కొంత మొత్తం అప్పు కావాలంటూ తన చిన్ననాటి స్నేహితుడు చాంద్‌ పీర్‌ను కోరాడు. ఆరి్థకంగా బలపడాలంటే డ్రగ్స్‌ దందా చేయాలని, ముంబై నుంచి తక్కువ ధరకు డ్రగ్స్‌ ఖరీదు చేసి తీసుకువచ్చి హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు అమ్మితే భారీ లాభాలు ఉంటాయని చెప్పాడు. న్యూ ఇయర్‌ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో డ్రగ్స్‌కు  మంచి డిమాండ్‌ ఉంటుందనీ సలహా ఇచ్చాడు. 

అందుకు హనీఫ్‌ అంగీకరించడంతో ముంబైకి చెందిన డ్రగ్స్‌ సప్లయర్స్‌ విక్కీ, రోహిత్‌లను పరిచయం చేశాడు. దీంతో వారి వద్దకు వెళ్లిన హనీఫ్‌ 13.9 గ్రాములు ఎండీఎంఏ ఖరీదు చేశాడు. దానిని తీసుకుని నేరుగా నగరానికి వచి్చన అతను కస్టమర్ల కోసం కార్ఖానాలోని దోభీఘాట్‌ వద్ద వేచి ఉన్నాడు. దీనిపై సమాచారం అందడంతో తూర్పు మండల టాస్‌్కఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌  నాగార్జున నేతృత్వంలో ఎస్సైలు ఎం.అనంతాచారి, ఎస్‌.కరుణాకర్‌రెడ్డి, పి.నాగరాజు తన బృందంతో దాడి చేసి హనీఫ్‌ను పట్టుకుని డ్రగ్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇతడిని తదుపరి చర్యల నిమిత్తం కార్ఖానా అధికారులకు అప్పగించి పరారీలో ఉన్న చాంద్‌ పీర్‌ కోసం గాలిస్తున్నారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)