Breaking News

'నా శ‌వాన్ని కూడా నా భార్య తాక‌డానికి వీల్లేదు'

Published on Mon, 08/03/2026 - 13:53

''నేను చ‌నిపోయిన త‌ర్వాత నా శ‌వాన్ని కూడా నా భార్య తాక‌డానికి వీల్లేదు. అంత్యక్రియల కోసం అన‌వ‌స‌రంగా ఎక్కువ డ‌బ్బు ఖర్చు చేయకండి. నా ఆత్మశాంతి కోసం ఎలాంటి మతపరమైన క్రతువులు నిర్వహించవద్దు. ఎందుకంటే నా  ఆత్మ శాంతించ‌ ఉండకూడదు. మా అమ్మ‌ను జాగ్రత్తగా చూసుకోండి''- అని వాట్సాప్ మెసేస్ పెట్టి  ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడో బాడీబిల్డ‌ర్‌.

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లాలో డిగ్రీ కళాశాలలో క్లర్క్‌గా పనిచేస్తున్న 52 ఏళ్ల బాడీబిల్డర్ దేవదత్ శర్మ అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తన ఇంట్లో తుపాకీతో కాల్చుకుని ఆయ‌న‌ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సర్సావా పోలీస్ స్టేషన్ (Sarsawa police station) పరిధిలోని సలేంపూర్ గ్రామంలో నివసిస్తున్న దేవదత్ శర్మ శనివారం సాయంత్రం తన ఇంటి వెనుక నిర్వహిస్తున్న "రాక్ జిమ్" నుంచి ఇంటికి వచ్చారు. సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తుపాకీ కాల్పుల‌ శబ్దం విని ఆయన భార్య సీమా రాణి అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో దేవదత్‌ను సమీప వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆత్మ‌హ‌త్య‌కు కొద్దిసేపటి ముందు దేవదత్ శర్మ తన మేనకోడలికి పంపిన వాట్సాప్ సందేశాన్ని కీలక ఆధారంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు, పొరుగువారిని విచారించారు. ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా భావిస్తున్నట్లు సర్కిల్ ఆఫీసర్ పవన్ కుమార్ తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దేవదత్ భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించనున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు, డిజిటల్ ఆధారాలు, వాట్సాప్ సందేశాన్ని పరిశీలించిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  పవన్ కుమార్ చెప్పారు.

మేనకోడలికి చివరి సందేశం
మరణానికి ముందు దేవదత్ శర్మ తన 21 ఏళ్ల మేనకోడలు నేహా శర్మకు వాట్సాప్‌లో సుదీర్ఘ సందేశం పంపినట్లు పోలీసులు తెలిపారు. అందులో తాను ఎదుర్కొంటున్న అవమానాలను ఇక భరించలేకపోతున్నానని పేర్కొన్నట్లు సమాచారం. ప్రతిరోజూ అవమానాలతో జీవించడం కంటే ఒక్కసారిగా మరణించడం మేలని భావించానని, అయితే తాను పిరికివాడిని కాదని సందేశంలో రాసినట్లు తెలుస్తోంది.

తన మరణానంతరం తన భార్య తన మృతదేహాన్ని తాకవద్దని కోరినట్లు సమాచారం. అంత్యక్రియల కోసం ఎక్కువ ఖర్చు చేయవద్దని, పిడకలు (ఆవుపేడతో చేసిన ఇంధనం) ఉపయోగించవద్దని కూడా సూచించినట్లు తెలుస్తోంది. తన ఆత్మశాంతి కోసం ఎలాంటి మతపరమైన క్రతువులు నిర్వహించవద్దని, తన ఆత్మ ప్రశాంతంగా ఉండకూడదని కూడా సందేశంలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. చివరగా తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని మేనకోడలిని కోరినట్లు సమాచారం. ఈ సందేశం ప్రామాణికతను పోలీసులు పరిశీలిస్తున్నారు.

రెండు దశాబ్దాలుగా జిమ్ నిర్వహణ
దేవదత్ శర్మ 2000 సంవత్సరం నుంచి తన ఇంటి వెనుక "రాక్ జిమ్" పేరుతో వ్యాయామశాలను నిర్వహిస్తున్నారు. స్థానికంగా బాడీబిల్డర్‌గా కూడా మంచి గుర్తింపు పొందారు. గత రెండేళ్లుగా బాలాజీ గ్రూప్ ఆఫ్ కాలేజీలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు తిలక్ రామ్ సైనీ గర్ల్స్ కాలేజ్, ఎలం చంద్ సైనీ గర్ల్స్ కాలేజీల్లో కూడా పనిచేశారు.

కుటుంబ నేపథ్యం
దేవదత్ శర్మకు సీమా రాణితో 33 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అభిషేక్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు ఆదిత్య చండీగఢ్‌లో ఫోరెన్సిక్ సైన్స్ చదువుతున్నాడు. దేవదత్ శర్మకు ఒక సోదరి ఉంది. ఆమె కుమార్తె నేహా శర్మకే ఆయన చివరి వాట్సాప్ సందేశం పంపినట్లు తెలిసింది.

(ఆత్మహత్య ఎన్నటికీ పరిష్కారం కాదు. మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోండి. మీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు వస్తే, దయచేసి ‘దిశా’ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు: 1056, 0471-2552056)

Videos

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

గణేష్ నిమజ్జనంలో సజ్జనార్ డ్యాన్స్ వైరల్

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

Photos

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)