Breaking News

అత్తా, కోడలిపై గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో ఐదుగురి అరెస్టు

Published on Wed, 10/16/2024 - 03:56

హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం నల్ల­బొమ్మనపల్లి సమీపంలో అత్తాకోడలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వి.రత్న మంగళవారం ఇక్క­డ విలేకరుల సమావేశంలో తెలిపారు. వారి నుంచి రూ.5,200 నగదు, రెండు మోటార్‌ బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో నిందితుని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. 

హిందూపురం త్యాగరాజనగర్‌కు చెందిన ఎరికల కావడి నాగేంద్ర, సాకే ప్రవీణ్‌కుమార్, మరో ముగ్గురిని సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు  హిందూపురం–పాలసముద్రం రోడ్డులోని బిట్‌ కాలేజీ వెనుక వైపున డంపింగ్‌ యార్డ్‌ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. హిందూపురం త్యాగరాజనగర్‌ గుడ్డం ఏరియాలో ఉంటున్న చాకలి శ్రీనివాసులు అలియాస్‌ శ్రీనాథ్‌ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. 

ఈ కేసుల్లో పట్టుబడ్డ నిందితులు కరడుగట్టిన నేరస్తులేనని, వారిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. ఎరికల కావడి నాగేంద్ర దోపిడీ, అత్యాచార కేసుల్లో నిందితుడని, అతనిపై అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో 37కు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. సాకే ప్రవీణ్‌కుమార్‌పై లేపాక్షి పోలీస్‌ స్టేషన్‌లో హత్య కేసు నమోదైందన్నారు. 

పరారీలో ఉన్న చాకలి శ్రీనివాసులు హిందూపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దోపిడీ  కేసులో ముద్దాయని తెలిపారు. ఇతని స్వగ్రామం లేపాక్షి మండలం కల్లూరు కాగా.. ప్రస్తుతం హిందూపురం త్యాగరాజనగర్‌ గుడ్డం ఏరియాలో ఉంటున్నాడన్నారు.

స్పెషల్‌ కోర్టు ద్వారా శిక్ష పడేలా చూస్తాం: ఎస్పీ
నిందితులకు స్పెషల్‌ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. ఘటన జరిగిన 48 గంటల్లోపే నిందితులను అరెస్టు చేశామన్నారు. ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 

కేసును ఛేదించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జిల్లా ఎస్పీ వి.రత్న, ఇతర పోలీస్‌ అధికారులను సీఎం, హోంమంత్రి, డీజీపీలు ప్రత్యేకంగా అభినందించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ వి.రత్న, డీఎస్పీ మహేష్‌ నగదు రివార్డులు అందజేశారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)