డిప్యూటీ కలెక్టర్‌ వికృత చేష్టలు.. ఆకస్మిక తనిఖీల పేరుతో.. బాలికల గదిలోకి వెళ్లి.. మంచంపై

Published on Wed, 07/12/2023 - 13:41

భోపాల్‌: ఆకస్మిక తనిఖీల పేరుతో సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ హోదాలో ఉన్న ఓ ప్రభుత్వ అధికారి వసతిగృహ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లాలో చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌డీఎం సునీల్ కుమార్ ఝా ఆదివారం బాలికల ఆశ్రమం ఝబువా హాస్టల్‌కు ఆకస్మిక తనిఖీ కోసం వెళ్లారు. అక్కడికి వెళ్లగానే హాస్టల్ సూపరింటెండెంట్‌ని గది బయటే ఉండమని.. బాలికలతో తాను ఒంటరిగా మాట్లాడాలని తెలిపారు. తనీఖీలో భాగంగా అనుకున్న ఆ సూపరింటెండెంట్‌ కూడా సరే అని రూం బయటే ఉండిపోయాడు.

బాలికల గదిలోకి వెళ్లగానే.. ఆ అధికారి ముందుగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం గురించి పలు ప్రశ్నలు అడిగారు. తర్వాత బాలికల మంచంపైన కూర్చొని వారిపై చేతులు వేయడం, కౌగిలించుకోవడం వంటి వెకిలి చేష్టలు చేయడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా బాలికలు ఇబ్బందిపడేలా వారి వ్యక్తిగత విషయాలను కూడా అడిగాడు.  11 నుంచి 13 ఏళ్ల వయసున్న విద్యార్థినులతో అతను దారుణంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినులు సూపరింటెండెంట్‌తో కలిసి సోమవారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు.

మరోవైపు, బాలికల ఫిర్యాదుని నమోదు చేసుకున్న  పోలీసులు ఆ అధికారిపై కేసు నమోదు చేశారు. అదే సమయంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో,  జిల్లా కలెక్టర్‌ నివేదిక ఆధారంగా నిందితుడిని విధుల నుంచి కూడా సస్పెండ్‌ చేశారు. పోలీసులు సునీల్‌ యాదవ్‌ ఝాను పోక్సో కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరచి, జుడిషియల్‌ కస్టడీకి తరలించారు.

చదవండి: ‘ఏమండీ వంటగదిలో డబ్బులు పెట్టాను. తీసుకోండి.. మీరు, పిల్లలు జాగ్రత్త’.. అంటూ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)