Breaking News

పెళ్లైన 2 నెలలకే.. నవవధువు అనుమానాస్పద మృతి!

Published on Mon, 07/06/2026 - 07:59

న్యూఢిల్లీ: కొత్త పెళ్లి ముచ్చట్లు తీరకముందే.. ఎనిమిదేళ్ల ప్రేమ బంధం మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. ఆఫీసులో సహోద్యోగులతో కలిసి నవ్వుతూ పార్టీ చేసుకున్న కొన్ని గంటల్లోనే, ఆ నూతన వధువు రక్తపు మడుగులో శవమై కనిపించింది. ఢిల్లీలో కలకలం రేపిన ఆకృతి సుతార్ అనుమానాస్పద మృతి వెనుక.. రూ. 20 లక్షల అదనపు కట్న వేధింపులు ఉన్నాయంటూ ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు

పెళ్లైన రెండు నెలలకే ఆకృతి సుతార్ (28) అనే వివాహిత ఢిల్లీలోని ఒక నివాస సముదాయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై స్పందించిన ఆమె కుటుంబ సభ్యులు.. ఇది ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ కట్నం కోసం చేసిన హత్యేనని తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

ఛతర్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఆకృతి, శనివారం ఉదయమే సెలవు ముగించుకుని తిరిగి విధుల్లో చేరింది. ఆఫీసులో తోటి ఉద్యోగులకు ఆమె ఒక చిన్న పార్టీ కూడా ఇచ్చింది. సాయంత్రం 6 గంటల సమయంలో తన తల్లితో ఫోన్‌లో మాట్లాడిన ఆకృతి.. ఆఫీస్ పార్టీ ముగించుకుని ఇంటికి బయలుదేరుతున్నట్లు చెప్పింది.

అయితే, రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆకృతి భర్త అరస్తు సిక్కా ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, ఆకృతి కనిపించడం లేదని తెలిపాడు. ఆ తర్వాత సుమారు గంటన్నరకే, లోధి కాలనీలోని పాలికా కుంజ్ నివాస సముదాయంలో ఒక మహిళ మృతదేహం పడి ఉందని పోలీసులు సమాచారం ఇచ్చారు. బిల్డింగ్ పైనుంచి కింద పడటం వల్లే ఆమె మృతి చెంది ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఎనిమిదేళ్ల ప్రేమ తర్వాత గత ఏప్రిల్ 24న ఆకృతి..నిరుద్యోగి అరస్తు సిక్కాను వివాహం చేసుకుంది. పెళ్లయినప్పటి నుంచి భర్త, అత్తమామలు రూ.20 లక్షల అదనపు కట్నం కోసం ఆమెను తీవ్రంగా వేధించేవారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అరస్తు గతంలో పలుమార్లు ఆమెను చంపేస్తానని బెదిరించాడని, మరణానికి రెండు రోజుల ముందు కూడా వారి మధ్య తీవ్రమైన గొడవ జరిగిందని ఆమె సోదరుడు అమయ్ సుతార్ తెలిపాడు. ఆకృతి మానసికంగా చాలా ధైర్యంగా ఉందని, ఆమె ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కట్నం వేధింపులు, హత్య కోణాలతో పాటు అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)