Breaking News

బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహారం.. ఇంటి పరిసరాల్లో రక్తపు మరకలు

Published on Wed, 05/10/2023 - 08:28

బోయినపల్లి(చొప్పదండి): సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జక్రాన్‌పల్లి మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని గాం«దీనగర్‌ గ్రామానికి చెందిన అందె రవితేజ (23) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో ఫోన్‌ వచ్చింది. భోజనం అనంతరం వాహనంలో పడుకుంటా అని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో స్తంభంపల్లి గ్రామంలో తమ బంధువుల ఇంటికి రవితేజ వచ్చాడు. అక్కడ గేటు వేసి ఉండడంతో గేటు దూకి లోపలికి వెళ్లాడు. 

తలుపులు తీయాలని బాదడంతో బంధువులు తీయలేదు. వారు బయటకు వచ్చి చూడగా అతడు అప్పటికే నిప్పంటించుకున్నాడు. ఈ క్రమంలో 100కు డయల్‌ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మహేందర్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రవితేజ మృతి విషయం అతడి తల్లి జ్యోతికి ఫోన్‌ చేసి చెప్పారు. మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా స్తంభంపల్లిలో ఘటన జరిగిన ఇంటి పరిసరాల్లో ఆరిన రక్తపు మరకలు ఉన్నాయని మృతుడి తల్లి జ్యోతి ఫిర్యాదులో పేర్కొంది. తన కుమారుడు రవితేజకు బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉందని ఈ క్రమంలోనే తన కుమారున్ని కత్తితో పొడిచి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, బంధువుల యువతి, ఆమె తల్లి, మేనమామ, అల్లుడిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ బన్సీలాల్‌ పరిశీలించారు. 

బంధువుల ఆందోళన 
సిరిసిల్లటౌన్‌: స్తంభంపల్లిలో మృతిచెందిన రవితేజ బంధువులు సోమవారం సిరిసిల్ల అంబేడ్కర్‌ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని బైఠాయించారు. ఈ కేసులో దోషులుగా ఆరోపిస్తూ సమీప బంధువులతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న సిరిసిల్ల టౌన్‌ సీఐ అనిల్‌కుమార్‌ వచ్చి రవితేజ బంధువులతో మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.   

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)